సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) తీవ్రంగా కాలిన గాయాలతో సుమారు 54 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ బుధవారం (ఆగస్ట్ 26) మృతి చెందింది. ఆమెను చండీగఢ్ నుంచి కిడ్నాప్ చేసి మొరిండాకు తీసుకెళ్లి, అక్కడ చెట్టుకు కట్టేసి నిప్పంటించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుమార్తె మృతిపై మంజీత్ తల్లి కాంతా దేవి ఫిర్యాదు చేయడంతో చండీగఢ్ పోలీసులు కిడ్నాప్, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంజీత్‌కు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. తల్లి మృతితో ఆ చిన్నారి అనాథగా మిగిలిపోయాడు