Kaizer News

‘పీరియడ్స్‌ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్‌

‘పీరియడ్స్‌ వస్తే నరకం.. నొప్పి భరించలేక కార్వాన్‌లో..’

· Entertainment · sakshi.com

తన వ్యక్తిగత విషయాలతో పాటు మహిళలు ఎదుర్కొనే సమస్యలపై కూడా బహిరంగంగా మాట్లాడుతుంటారు నటి శ్రుతిహాసన్‌. తాజాగా సైఫ్‌ అలీఖాన్‌ సోదరి, నటి సోహా అలీఖాన్‌ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌, పీరియడ్స్‌ వంటి అంశాలపై మాట్లాడారు. చిన్నతనంలో నెలసరి సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. ‘13 ఏళ్ల వయసులో తొలిసారి నాకు పీరియడ్స్‌ వచ్చాయి. ఆ సమయంలో తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకున్నప్పటికీ.. తన పరిస్థితి చూసి ఆందోళన చెందేవారు. పిరియడ్స్‌ వచ్చిన రెండు గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి వచ్చేది. ఇలా దాదాపు 12 రోజుల పాటు ఇబ్బంది పడేదాన్ని’ అని తెలిపారు. కార్వాన్‌లోకి వెళ్లి వాంతులు.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ సమస్యలు తనను వెంటాడాయని శ్రుతి చెప్పారు. పీరియడ్స్‌ సమయంలో డ్యాన్స్‌, యాక్షన్‌ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టంగా ఉండేదని తెలిపారు. షూటింగ్‌ సమయంలో కార్వాన్‌లోకి వెళ్లి వాంతులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నొప్పి తగ్గేందుకు పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుంటే మత్తుగా, అయోమయంగా అనిపించేది. మందులు వాడే సమయంలో చాలా ఎమోషనల్‌గా మారిపోయేదాన్నని, కారణం లేకుండానే ఏడ్చేదాన్ని’ అని శ్రుతి గుర్తుచేసుకున్నారు. ఇదీ చదవండి: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలపైనే అమ్మ కావాలని ఉంది.. ఇదే సందర్భంగా మదర్‌హుడ్‌పై తన అభిప్రాయాలను కూడా శ్రుతిహాసన్‌ పంచుకున్నారు. భవిష్యత్తులో తల్లి కావాలని తాను నిజంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే చిన్నతనం నుంచే పీసీఓఎస్‌ ఉందని, దాని కారణంగా భవిష్యత్తులో తల్లి కావడం కష్టమవుతుందని చెప్పడంతో చాలా కాలం ఆ విషయంలో భయపడినట్లు వెల్లడించారు. అయితే ఎగ్‌ ఫ్రీజింగ్‌తో పాటు దత్తత వంటి అవకాశాల గురించి పలువురు డాక్టర్లతో మాట్లాడడంతో కొంతవరకు భయం తగ్గిదని తెలిపారు. భవిష్యత్తులో తన పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని, దత్తత విషయంలోనూ తాను ఓపెన్‌గా ఉన్నానని శ్రుతిహాసన్‌ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ తొలి కెప్టన్‌ రైతు బిడ్డ.. లక్ష నజరానా ప్రకటించిన ప్రముఖ సంస్థ ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్‌ పంజాగుట్టలో సందడి చేసిన సినీ నటి రాశీ సింగ్ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News