Kaizer News

హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఇలా వెళ్తే త్వర

హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఇలా వెళ్తే త్వరగా వెళ్లొచ్చు

· City - Hyderabad · sakshi.com

హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా ఆగస్టు 30న ఉదయం 4.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఈ పరుగు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుండి ప్రారంభమై, రోడ్ నంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలిలోని జి.ఎమ్.సి. బాలయోగి స్టేడియం వరకు కొనసాగుతుంది. మారథాన్ రన్ మార్గం పీపుల్స్ ప్లాజా (నెక్లెస్ రోడ్) – రోటరీ – ఎన్‌టిఆర్ మార్గ్ – ట్యాంక్ బండ్ – చిల్డ్రన్స్ పార్క్ – సెయిలింగ్ క్లబ్ – సోనాబీ మసీదు – బుద్ధ భవన్ – సంజీవయ్య పార్క్ – పీపుల్స్ ప్లాజా – రోటరీ – వి.వి. విగ్రహం, ఖైరతాబాద్ – లోక్ భవన్ రోడ్ – సోమాజిగూడ – పంజాగుట్ట ఫ్లైఓవర్ – ఎంజె కాలేజ్ – ఎస్ఎన్‌టి జంక్షన్ – సాగర్ సొసైటీ – కెబిఆర్ పార్క్ – జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ – రోడ్ నంబర్ 45 – కేబుల్ బ్రిడ్జి. ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ వైపు నుండి వచ్చే వాహనాలు: నెక్లెస్ రోడ్ వైపు అనుమతించరు. నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట, రాజ్ భవన్ నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు: వి.వి. విగ్రహం వద్ద షాదాన్, నిరంకారీ భవన్ మీదుగా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్ నుండి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలు: కె.సి.పి వద్ద తాజ్ కృష్ణా - రోడ్ నం. 10 & 12, క్యాన్సర్ హాస్పిటల్ - ఒడిశా ఐలాండ్ మీదుగా జూబ్లీహిల్స్ వైపు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలి. ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు: తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభ పాయింట్ వద్ద ఫ్లైఓవర్ పైకి మళ్లిస్తారు. లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు: అంబేడ్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి, ఇక్బాల్ మినార్ యు-టర్న్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా లోయర్ ట్యాంక్ బండ్ / కట్ట మైసమ్మ గుడి వైపు మళ్లిస్తారు. కర్బాలా వైపు నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: చిల్డ్రన్స్ పార్క్ వద్ద డిబిఆర్ మీదుగా కవాడిగూడ వైపు మళ్లిస్తారు. ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుండి సెయిలింగ్ క్లబ్ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద డిబిఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చు వాహనాలు: అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించరు. డిబిఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్, గోశాల మీదుగా జబ్బార్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు. మారథాన్ నెక్లెస్ రోటరీకి చేరుకున్నప్పుడు: బేగంపేట నుండి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను గ్రీన్‌లాండ్స్ జంక్షన్ వద్ద డి.కె. రోడ్, అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు. బంజారాహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సిఎల్ - తాజ్ కృష్ణా, రోడ్ నం. 10 & 12, బంజారాహిల్స్ మీదుగా వెళ్లాలి. జూబ్లీహిల్స్ వైపు వెళ్లేందుకు: డి.కె. రోడ్, అమీర్‌పేట్, మైత్రివనం, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లాలి. మారథాన్ పంజ

Original source: sakshi.com
Read more on Kaizer News