Kaizer News

సీఎం ప్రజావాణిలో దరఖాస్తుదారుల తాకిడి

సీఎం ప్రజావాణిలో దరఖాస్తుదారుల తాకిడి

· City - Hyderabad · sakshi.com

సాక్షి,హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో శుక్రవారం నిర్వహించిన 256వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 11 గ్రూపులు, 575 మంది ద్వారా 136 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ శాఖకు 33, బీసీ సంక్షేమ శాఖకు 27, హోం శాఖకు 15, ఇతర శాఖలకు 61 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి ఓపికగా దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్‌మెంట్‌ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా మలి దశ ఉద్యమకారులకు తగిన గుర్తింపును ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించి, ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతూ పలువురు అర్జీలను అందజేశారు. భ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ మమితా బైజు గ్లామర్..ఫోటోలు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీమలయప్ప స్వామి వారు (ఫొటోలు) సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ (ఫొటోలు) BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు! త్వరలోనే బై-ఎలక్షన్స్..? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు..? టాటాకు విన్ఫాస్ట్ షాక్.. బైక్ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ కారు.. ధర తెలుస్తే షాక్ ముగ్గురు పిల్లల్ని కంటాం.. మా జీతాలు పెంచండి.. బాబు పరువు తీసిన CITU నాయకులు రాత్రయితే 90 వేసి పడుకుంటా.. నేను తాగే బ్రాండ్ కూడా అదే

Original source: sakshi.com
Read more on Kaizer News