Kaizer News

Man Throws Acid At Ex-Fiancee | పెళ్లి రద్దుపై ఆగ్

Man Throws Acid At Ex-Fiancee | పెళ్లి రద్దుపై ఆగ్రహించిన వ్యక్తి.. మహిళ, ఆమె సోదరిపై యాసిడ్‌ దాడి

· National - India · ntnews.com

లక్నో: ఒక వ్యక్తి డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుసుకుని అతడితో జరుగాల్సిన పెళ్లిని మహిళ కుటుంబం రద్దు చేసింది. ఆగ్రహించిన అతడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ మహిళతో పాటు ఆమె సోదరిపై యాసిడ్‌తో దాడి చేశాడు. మహిళ కుటుంబ సభ్యులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. (Man Throws Acid At Ex-Fiancee) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆవాస్ వికాస్ కాలనీకి చెందిన హర్ష్ భాటికి ఒక యువతితో పెళ్లి నిశ్చియమైంది. అయితే అతడు డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుసుకున్న కాబోయే భార్య కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. కాగా, పెళ్లి రద్దు కావడంపై హర్ష్‌ ఆగ్రహించాడు. శనివారం రాత్రి యాసిడ్‌ బాటిల్స్‌తో ఆ యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆమె తలుపు తీయగానే యాసిడ్‌ పోశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ మహిళ సోదరిపై కూడా యాసిడ్‌ పోశాడు. వారి కేకలు విన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నించిన హర్ష్‌ను పట్టుకున్నారు. ఈ సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులకు అతడ్ని అప్పగించారు. బాధిత మహిళల తండ్రి ఫిర్యాదు ఆధారంగా హర్ష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News