Kaizer News

Car accident | కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి

Car accident | కారు ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి

· City - Hyderabad · ntnews.com

హైదరాబాద్ : సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజ్హాన్ ఉద్దీన్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో మొహియుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సిల్ తీసుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు ఆయన కుమారుడు ఇజ్హాన్ ఉద్దీన్‌ను ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. బాలుడిని వెంటనే షాలిని దవాఖానకు తరలించారు. అనంతరం ఓవైసీ హాస్పిటల్‌కి తరలించగా, వైద్యులు పరీక్షించిన తర్వాత బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

Original source: ntnews.com
Read more on Kaizer News