Kaizer News

Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్.. హల్ద్వానీ

Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు

· National - India · ntvtelugu.com

Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు Follow Us : --> Add as a preferred source on google Rahul Gandhi in Legal Trouble: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మల్లికార్జున ఖర్గే ర్యాలీ అనంతరం జరిగిన ‘శుద్ధీకరణ’ కార్యక్రమంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తమ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బతీశాయని వాల్మీకి కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు రాహుల్ గాంధీపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 196, 299, అలాగే ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని సెక్షన్ 3(1) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జవహర్ నగర్‌కు చెందిన అమిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయన శ్రీ రామ్ సేన ధర్మార్థ సేవా న్యాస్ సభ్యుడిగా ఉన్నారు. ఆగస్టు 29న రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తమ కమ్యూనిటీని అవమానించేలా ఉన్నాయని అమిత్ కుమార్ ఆరోపించారు. ఖర్గే ర్యాలీ జరిగిన అనంతరం హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ‘ఆచార, పరిశుభ్రత కార్యక్రమాన్ని’ రాహుల్ గాంధీ తప్పుగా చిత్రీకరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని అంటరానితనం పాటించే వారిగా, దళిత వ్యతిరేకులుగా చిత్రీకరించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. అమిత్ కుమార్ తాను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని తెలిపారు. తాము నిర్వహించిన కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే ర్యాలీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, వివిధ కులాలకు చెందిన వ్యక్తులతో పాటు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో అమిత్ కుమార్‌తో పాటు శ్రీ రామ్ సేన ధర్మార్థ సేవా న్యాస్‌కు చెందిన వినోద్ ఆర్య కూడా ఉన్నారు. రాహుల్ గాంధీని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వినోద్ ఆర్య మీడియాతో మాట్లాడుతూ, తాను సనాతన సంప్రదాయాలను అనుసరించే వ్యక్తినని, శ్రీరాముడిని పూజించే ప్రదేశంలో పరిశుభ్రతను కాపాడటం తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను కూడా దళితుడినని, ఈ కార్యక్రమంలో తనతో పాటు ఇతర దళితులు కూడా పాల్గొన్నారని చెప్పారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. హల్ద్వానీలోని రామ్‌లీలా మైదానంలో ఆగస్టు 11న మల్లికార్జున ఖర్గే నిర్వహించిన ర్యాలీ తర్వాత ‘ప్యూరిఫికేషన్ యజ్ఞం’ నిర్వహించడంతో వివాదం మొదలైంది. ఈ పరిణామంపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై స్పందిస్తూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఖర్గేకు న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల్లో ‘ప్యూరిఫికేషన్’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక

Original source: ntvtelugu.com
Read more on Kaizer News