Kaizer News

ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యురేనియం డీల్..భార

ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యురేనియం డీల్..భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు అంగీకారం

· National - India · v6velugu.com

తాష్కెంట్:భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దీర్ఘకాలిక ప్రాతిపదికన యురేనియాన్ని సరఫరా చేసేందుకు ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. సివిల్- న్యూక్లియర్ ఇంధన రంగంలో సహకారంలో భాగంగా ఈ మేరకు ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. యురేనియం సరఫరా కోసం ఒక ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయి. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆదివారం ఆ దేశ ప్రెసిడెంట్ శౌకత్ మిర్జియోయేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమై చర్చలు జరిపారు. మైనింగ్, సంస్కృతి, విద్య, పర్యాటకం, ఆయుర్వేదం సహా వివిధ రంగాల్లో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఫయాజ్ టెపా, కరా టెపా బౌద్ధ స్థలాల పునరుద్ధరణ, పరిరక్షణ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కూడా అంగీకారం కుదిరింది. అనంతరం ఇద్దరు నేతలు కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్, భారత్ మధ్య ఏడాదికి బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుండగా.. దానిని 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ప్రకటించారు. ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 15 ఏండ్లు పూర్తయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. శనివారం రాత్రి జరిగిన విందు సమయంలోనూ ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ శౌకత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తాను కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. రెండు దేశాల మధ్య సమన్వయం కోసం విదేశాంగ మంత్రుల స్థాయిలో ఒక కోఆర్డినేషన్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు దేశాలు తమ రక్షణ పరిశ్రమలను సైనిక హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి దిశగా ప్రోత్సహిస్తాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే, మార్కెట్ యాక్సెస్, బ్యాంకింగ్, పేమెంట్ సిస్టమ్స్, కనెక్టివిటీకి సంబంధించిన సమస్యలను ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తామన్నారు. “ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ముప్పులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తాం” అని ప్రకటించారు. ఉజ్బెక్ ప్రెసిడెంట్ శౌకత్ మిర్జియోయేవ్ మాట్లాడుతూ.. “ఎనర్జీ, కల్చర్, క్రిటికల్ మినరల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆభరణాలు, వ్యవసాయం వంటి రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వెల్లడించారు. కాగా, ఆదివారం తాష్కెంట్ పర్యటన ముగించుకున్న మోదీ కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తాన్ రాజధాని బిష్కెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బయలుదేరారు. బిష్కెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఓ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం ‘ఒలియ్ దరాజాలి దోస్తిలిక్’ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆ దేశ అధ్యక్షుడు శౌకత్ మిర్జియోయేవ్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ.. “ఒలియ్ దరాజాలి దోస్తిలిక్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ఉన్న చిరకాల బంధానికి ఈ పురస్క

Original source: v6velugu.com
Read more on Kaizer News