Kaizer News

న్యూయార్క్‌లో భగవత్‌ పర్యటనపై రాద్ధాంతం

న్యూయార్క్‌లో భగవత్‌ పర్యటనపై రాద్ధాంతం

· National - India · ntnews.com

వాషింగ్టన్‌, ఆగస్టు 28: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ శనివారం న్యూ యార్క్‌లో పాల్గొనబోయే సమావేశంపై రాద్ధాంతం మొదలైంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆయన న్యూయా ర్క్‌ చేరుకున్నారు. కొన్ని సంస్థలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, కార్యకర్తలతో ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని ‘హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌’ (హెచ్‌ఏఎఫ్‌) విజ్ఞప్తి చేసింది. కార్యక్రమ రద్దుకు, అవాంతరాలకు ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. హాజరయ్యేవారికి, పౌర హక్కులకు రక్షణ కల్పించాలని న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీని కోరింది. సభా వేదిక వద్ద నిరసనలు నిర్వహించాలని హిందూస్‌ ఫర్‌ హ్యూ మన్‌ రైట్స్‌, సేవ్‌ అమెరికా ఫ్రం హిందు త్వ, ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కౌన్సిల్‌, దళిత్‌ సాలిడారిటీ ఫోరం వంటి సంస్థలు సిద్ధమవుతున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News