Kaizer News

తెలంగాణలో నేర సామ్రాజ్యం!

తెలంగాణలో నేర సామ్రాజ్యం!

· City - Hyderabad · ntnews.com

మూడేండ్లలో 7.15% పెరిగిన నేరాలు డ్రగ్స్‌ కేసుల్లో భారీగా 46.10% వృద్ధి లక్ష జనాభాకు నేరాల రేటు 491.59 కి పెరుగుదల భారీగా పెరుగుతున్న సాధారణ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు ట్రాఫిక్‌ నేరాల్లోనూ 9.48% జంప్‌ సైబర్‌, ఆర్థిక నేరాల్లో స్వల్ప ఊరట తీవ్రమైన నేరాలు 10.33% తగ్గుదల హైదరాబాద్‌, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం లో నేరాల రేటు పెరిగిపోతున్నది. అర్ధ వార్షిక నేర సమీక్ష సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2023 జూలై నుంచి 2026 జూలై మధ్యలో నేరాల రేటు భారీగా నమోదైంది. 2023 జూలై నుంచి 2024 జూన్‌ వరకు 2,65,377 నేరాలు నమోదుకాగా, 2024 జూలై నుంచి 2025 జూన్‌ వరకు 2,77,938 నేరాలు నమోదయ్యాయి. 2023తో పోల్చితే 2024 లో అత్యంత దారుణంగా 12,516 నేరాలు పెరుగగా, నేరాల్లో 4.73% పెరుగుదల నమోదైంది. 2025 జూలై నుంచి 2026 జూన్‌ వరకు అదే స్థాయిలో 2,84,363 నేరాలు నమోదైనట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో 6,425 నేరాలు పెరుగగా, 2.31% పెరుగుదల కనిపించింది. మూడేండ్లలో కేసీఆర్‌ పాలన 5 నెలలు తీస్తే.. కాంగ్రెస్‌ పాలనలో దారుణంగా క్రైమ్‌రేట్‌ నమోదవుతున్నట్టు జాతీయనేర గణాంకాలు, రాష్ట్ర పోలీసు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. మూడేండ్లలో 7.15% నేరాలు పెరుగడం ఆందోళనకరం. లక్ష జనాభాకు నేరాల రేటు 491.59కి పెరుగుదల తెలంగాణలో గత మూడేండ్లలో పెరుగుతున్న నేరాలను కట్టడి చేయడంలో హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమవుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2023-24, 2025-26లో నమోదైన కేసులు ఆధారంగా తెలంగాణలో ప్రతి లక్ష జనాభాకూ నేరాల రేటు 481.58 నుంచి 491.59కి పెరిగినట్టు పోలీసు నివేదికలు వెల్లడించాయి. అత్యధికంగా మాదకద్రవ్యాల కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరి.. మూడేండ్లలో 46.10% పెరుగుదల దిశగా పయనించాయి. వ్యవస్థీకృత నేరాలు 25 నుంచి 451కు పెరిగి 1,704% పెరుగుదల నమోదు చేశాయి. ట్రాఫిక్‌ నేరాలు 29,130 నుంచి 31,891కు పెరిగి 9.48% అధికమయ్యాయి. మరోవైపు సైబర్‌ నేరాలు 25,373 నుంచి 22,000 (13.29%) తగ్గాయి. వీటితోపాటు ఆర్థిక నేరాలు కూడా 37,690 నుంచి 32,684కి (13.28%) క్షీణించాయి. ఆందోళన కలిగిస్తున్న డ్రగ్స్‌ కేసులు తెలంగాణలోని పట్టణాలు గ్రామాలు, నగరాల్లో గంజాయి తిష్ట వేసిందనడానికి నిదర్శనం నమోదవుతున్న డ్రగ్స్‌ కేసులే. రాష్ట్రంలో నారోటిక్‌ కేసుల పెరుగుదల పోలీస్‌ శాఖకు ప్రధాన సవాలుగా మారుతున్నదని ఉన్నతాధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్న పరిస్థితి. ఈ డ్రగ్స్‌ కేసులు 2023-24లో 2,026 ఉండగా.. 2025-26లో 2,960కు చేరాయి. లక్ష జనాభాకు ఈ డ్రగ్స్‌ నేరాల నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది. కమిషనరేట్ల వారీగా చూస్తే.. సైబరాబాద్‌లో 266 నుంచి 508కు చేరి 90.98% పెరుగుదల నమోదైంది. వరంగల్‌లోనూ గడిచిన మూడేండ్లలో 142.31% పెరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. డ్రగ్స్‌ కేసుల నమోదు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 57 నుంచి 219కి పెరిగాయి. నేరాల రేటు 7.22 నుంచి 26.91కు చేరింది. నిజామాబాద్‌లో 62 నుంచి 123కు కేసులు పెరుగుతున్నాయి. నారాయణపేట, మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్

Original source: ntnews.com
Read more on Kaizer News