న్యూఢిల్లీ: పశ్చిమ ఢిల్లీలోని రాజధాని పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక కలప (టింబర్) గోదాములో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఢిల్లీ అగ్నిమాపక సేవల విభాగం వెల్లడించింది. ఒక భవనం బేస్‌మెంట్‌లో సుమారు 2,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కలప గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో భారీ ఎత్తున కలప నిల్వలు ఉండటంతో క్షణాల్లోనే మంటలు శరవేగంగా వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపు చేసేందుకు మొత్తం 25 ఫైరింజన్లను ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి, పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. ఎట్టకేలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. గోదాము బేస్‌మెంట్‌లో ఉన్నప్పటికీ మంటలను సకాలంలో నియంత్రించగలిగామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు, గోదాములో జరిగిన ఆస్తి నష్టం తీవ్రతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బెడిసికొట్టిన వితంతు వదినతో ప్రేమ.. యువకుడు ఆత్మహత్య షూటింగ్ కోసం ఓనం మిస్.. ర్యాండమ్ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు) ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నడ్డివిరిగేలా చంద్రబాబు చావుదెబ్బ.. ఎడా పెడా బాదుడే బాదుడు పాలు పారబోసిన రైతులు.. ధర పెంచాలంటూ తమిళనాడులో నిరసన షాక్ లో యాంకర్ ఈశ్వర్.. తమాషా కాదు అడిగితే కాల్చి పడేస్తారు.. కారుమూరి సంచలన నిజాలు