Kaizer News

Pakala Srihari Rao | బ్యాంకుల రుణాల ఎగవేతను అరికట్

Pakala Srihari Rao | బ్యాంకుల రుణాల ఎగవేతను అరికట్టడంలో విఫలం.. కేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేయాలి : పాకాల శ్రీహరి రావు

· City - Hyderabad · ntnews.com

Pakala Srihari Rao | గౌరవ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వేలాది కోట్ల రూపాయిల బ్యాంకుల రుణాల ఎగవేతను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రజలనుంచి పెద్ద ఎత్తున తరుగుబాటు రాకముందే గౌరవంగా రాజీనామా చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశారు. జీ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర కుటుంబానికి చెందిన వివిధ కంపెనీలకు రూ. 22,000 కోట్లకు పైగా ఉన్న వ్యక్తిగత పూచీకత్తు (Personal Guarantee) రుణ బాధ్యతలకు గాను, NCLT ద్వారా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి దాదాపు 99.97% అపారమైన రాయితీ (Haircut) పొందేందుకు ఆమోదం లభించడం వెనుక ఎవ్వరైనా పెద్దల హస్తం ఉన్నదేమో తేల్చి, అప్పు ఇచ్చిన అధికారులపైన, ఎగవేత దారులపైనా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ (OTS) లేదా రుణమాఫీల ద్వారా ప్రజాధనం వృథా కాకుండా చూడటానికి, బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం, RBI/SEBI తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అంత భారీ మొత్తంలో అసలు పూచీకత్తు లేకుండా రుణాలు ఏ ప్రాతిపదికన మంజూరు చేశారు..? ఆ సమయంలో బ్యాంకింగ్ భద్రతా నియమాలను, ప్రామాణిక విధివిధానాలను పక్కనబెట్టిన అధికారులపై క్రిమినల్ విచారణ జరిపి తగిన శిక్ష విధించాలని పాకాల శ్రీహరి రావు డిమాండ్ చేశారు. ఈ తరహా ఎగవేతల వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్షణమే జోక్యం చేసుకుని, ఉన్నత న్యాయస్థానాలలో అప్పీలు చేయడంతో పాటు పూర్తి బకాయిల రికవరీకి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సెప్టెంబ‌ర్ 1న‌ ఉమ్మడి నల్ల‌గొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు Cortisol Face | ముఖం వాపుల‌కు గురైన‌ట్లుగా క‌నిపిస్తుందా.. దీన్ని ఏమంటారు, బ‌య‌ట ప‌డాలంటే ఏం చేయాలి..? Suryapet News | వేపచెట్టు వివాదం.. రెండు నిండు ప్రాణాలు బ‌లి.. ఎస్ఐకి గాయాలు!

Original source: ntnews.com
Read more on Kaizer News