Kaizer News

TG SAFE : బాబోయ్.. హైదరాబాద్ హోటళ్లలో షాకింగ్ సీన్

TG SAFE : బాబోయ్.. హైదరాబాద్ హోటళ్లలో షాకింగ్ సీన్లు..

· City - Hyderabad · hmtvlive.com

TG SAFE : హైదరాబాద్ నగరంలోని భోజనప్రియులకు తీవ్ర షాకిచ్చేలా ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు నగరంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. భాగ్యనగరంలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ఏడు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు , పోలీసు సిబ్బందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భాగంగా చట్నీస్, పిస్తా హౌస్, ఓరిస్, స్పైస్ ఎవెన్యూ వంటి ప్రతిష్టాత్మక హోటళ్లలో అధికారులు సోదాలు చేపట్టారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతుండటం, నాసిరకం వస్తువులను నిల్వ చేయడం వంటి తీవ్రమైన లోపాలను గుర్తించిన అధికారులు నాలుగు ప్రముఖ హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల సమయంలో రెస్టారెంట్లలో కనిపించిన దృశ్యాలు అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. వంటశాలలలో కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం, ఎప్పుడో గడువు ముగిసిన ఆహార పదార్థాలను అలాగే స్టోర్ రూమ్‌లలో ఉంచడం, సరిగా లేని వాతావరణంలో ఆహారాన్ని నిల్వ చేయడం వంటి లోపాలు కనిపించాయి. కొన్ని చోట్ల ఏకంగా కుళ్లిపోయిన కూరగాయలను వాడటమే కాకుండా, పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు ఆహార పదార్థాలపై ముద్రించాల్సిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (FSS) లేబులింగ్, డిస్‌ప్లే నిబంధనలను నిర్వాహకులు బొత్తిగా పట్టించుకోవడం లేదని తేలింది. పిస్తా హౌస్‌లో రూ. 17,500 విలువైన సరుకులు సీజ్ గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ అవుట్‌లెట్‌లో నిర్వహించిన సోదాల్లో స్టోర్ ఏరియాలో తీవ్ర ఉల్లంఘనలను అధికారులు పట్టుకున్నారు. మిస్ బ్రాండింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అక్కడ నిల్వ ఉంచిన 15 కిలోల జీడిపప్పు, 24 కిలోల డ్రై నూడుల్స్, 5 కిలోల పొటాటో చిప్స్‌ను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ పదార్థాల మొత్తం విలువ సుమారు రూ. 17,500 ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే అక్కడ ఉపయోగిస్తున్న మస్కటి నెయ్యి, వంగల్ పనీర్ నమూనాలను నాణ్యత , కల్తీని నిర్ధారించేందుకు సేకరించారు. సాంపిల్స్ సేకరణ – ల్యాబ్ పరీక్షలకు పంపిన అధికారులు ఈ మెరుపు దాడుల క్రమంలో కల్తీ జరిగిందనే తీవ్ర అనుమానంతో మొత్తం 11 రకాల ఆహార నమూనాలను అధికారులు సేకరించి సైంటిఫిక్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హోటళ్ల వైఖరిపై మండిపడిన అధికారులు, వెంటనే తమ నిర్వహణ లోపాలను సరిదిద్దుకోవాలని హెచ్చరిస్తూ నాలుగు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. మరో మూడు రెస్టారెంట్లకు కారణం చూపాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సహించేది లేదు.. రెస్టారెంట్లకు సీరియస్ హెచ్చరిక తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను టీజీ సేఫ్ అధికారులు విడుదల చేశారు. ప్రజల ఆరోగ్యం , ప్రాణాలతో చెలగాటమాడితే ఎంతటి పెద్ద రెస్టారెంట్లపైనైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతీ హోటల్ తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని, నాణ్యమైన , తాజా పదార్థాలనే వినియోగదారులకు అందించాలని స్పష్టం

Original source: hmtvlive.com
Read more on Kaizer News