FSSAI: ప్రముఖ మసాలా బ్రాండ్లు ఎవరెస్ట్, లాల్‌జీ గోధూ సంస్థలకు చెందిన ఇంగువ (అసాఫోటిడా) అమ్మకాలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తాత్కాలికంగా నిషేధం విధించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అలర్ట్ అయిన ఆహార భద్రతా అధికారులు.. ముంబైలోని ఈ రెండు కంపెనీల తయారీ కేంద్రాలతో పాటు గుజరాత్‌లోని ఉంబర్‌గావ్‌లో ఉన్న ఎవరెస్ట్ యూనిట్ నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఈ నాణ్యతా పరీక్షల్లో ఇరు కంపెనీల ఇంగువ ఉత్పత్తులు తీవ్ర ప్రమాణాల లోపంతో ఉన్నట్లు తేలింది