Kaizer News

Shabad: షాబాద్‌లో కుసుమ విత్తనాల పంపిణీ: ఎమ్మెల్యే

Shabad: షాబాద్‌లో కుసుమ విత్తనాల పంపిణీ: ఎమ్మెల్యే కాలే యాదయ్య

· City - Hyderabad · hmtvlive.com

Shorts Shabad: నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్ (NMEO-OS) 2026-27 కార్యక్రమంలో భాగంగా షాబాద్ రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర ఆధ్వర్యంలో కుసుమ విత్తనాల పంపిణీ, కుసుమ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన రైతులకు కుసుమ–లక్ష్మీ ప్రియ (ISF-764) రకం ధృవీకరించబడిన విత్తనాలను పంపిణీ చేశారు. మొత్తం 20 క్వింటాళ్ల కుసుమ విత్తనాలను 200 హెక్టార్ల విస్తీర్ణానికి, హెక్టారుకు 10 కిలోల చొప్పున రైతులకు అందజేశారు. కుసుమ సాగు విధానం, పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దిగుబడి పెంపునకు అనుసరించాల్సిన పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కుసుమ పంటను ప్రత్యామ్నాయ నూనెగింజల పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందేలా వ్యవసాయ శాఖ అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని,నాణ్యమైన ధృవీకరించబడిన విత్తనాలను వినియోగించడం, శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు. పంట ప్రారంభ దశ నుంచే కలుపు నివారణ, తగిన ఎరువుల వినియోగం, తెగుళ్ల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వ్యవసాయ శాఖ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కుసుమ సాగు విస్తీర్ణాన్ని పెంచి నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు. అనంతరం షాబాద్ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్‌నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పిసరి సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంటారెడ్డి, సర్పంచులు ఆశోక్, రాజేందర్ రెడ్డి, సందీప్, నవనీత స్వామి, స్వరూప మహేందర్ గౌడ్, శాంతమ్మ యాదయ్య, పోచయ్య, మంగమ్మ, సవిత, సుభాష్ చంద్ర, గోపాల్, సబితా గోవర్ధన్ రెడ్డి, నర్సింలు, స్వాతి, మాణిక్యం, ఎఫ్‌పీవో ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News