మాదాపూర్, వెలుగు: హైదరాబాద్ మారథాన్15 ఎడిషన్ అదిరింది.. నగర రోడ్లన్నీ పరుగుల వీరులతో నిండిపోయాయి. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో యువత, నడీడు వాళ్లు, వృద్ధులు అన్న తేడా లేకుండా వేలాది మంది పాల్గొన్నారు. ఆఫ్రికాకు చెందిన ఎలైట్ రన్నర్స్తో పాటు పాటు మన దేశానికి చెందిన వారు పోటీపడి రికార్డులు బ్రేక్చేశారు. మారథాన్లో మొత్తం 32వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా, హాఫ్, ఫుల్ మారథాన్లలో 11వేల మంది, 10కేలో 9వేలు, 5కే, ఇన్క్లూజివ్ రన్లో 6,500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ రమేశ్ మాట్లాడుతూ ఈ మారథాన్ఉత్సాహం చూస్తుంటే హైదరాబాద్లో రన్నింగ్ కమ్యూనిటీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుందన్నారు. హైదరాబాద్.. దేశ ఈవెంట్స్ క్యాపిటల్గా ఎదుగుతోందన్నారు. వివిధ విభాగాల్లో దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బంది మారథాన్లో పాల్గొన్నారన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్సీపీ సన్ప్రీత్సింగ్, డైరెక్టర్వివేక్నిశాంత్నాథ్, ఫైనాన్స్డైరెక్టర్అనురాగ్కపిల్, హైదరాబాద్రన్నర్స్ సొసైటీ కుమార్కలియప్పన్ పాల్గొన్నారు. ‘ఎలైట్స్’ విజేతలు వీరే.. పురుషుల ఎలైట్ విభాగంలో ఇథియోపియాకు చెందిన సెబోకా నెగుస్సే విజేతగా నిలవగా, కెన్యాకు చెందిన ఫెలిక్స్ కిముటై రెండో స్థానంలో, అదే దేశానికే చెందిన ఫ్రాన్సిస్ చెరుయియోట్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత పురుషుల్లో గోపీ తోనకల్ నాలుగో స్థానంలో నిలిచి అగ్ర భారతీయ రన్నర్గా నిలిచారు. మన్ సింగ్, ప్రదీప్ సింగ్ చౌహాన్, రంజిత్ సింగ్, బుగత శ్రీను తర్వాత స్థానాల్లో నిలిచారు. మహిళల ఎలైట్ విభాగంలో ఇథియోపియాకు చెందిన ఎమానే సెయిఫు విజేతగా నిలవగా, ఆ దేశానికే చెఇందిన ట్సెగా డెస్టా రెండు, కెన్యాకు చెందిన టెరెసియా ఒమోసా మూడో స్థానంలో నిలిచారు. భారత మహిళల్లో నర్మిబెన్ ఠాకోర్ అగ్రస్థానంలో నిలవగా, భాగీరథి నోన్, మీనాక్షి నేగి, మారిపల్లి ఉమ, భగవతి దాంగి తర్వాతి స్థానాల్లో నిలిచారు. విజేతల్లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.3 లక్షలు, రెండో స్థానానికి రూ.రెండున్నర లక్షలు, థర్డ్ప్లేస్కు రూ. రెండు లక్షలు, నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా లక్షన్నర నుంచి 75 వేల వరకు అందజేశారు. ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే.. ఫుల్మారథాన్ను నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ప్లాజా వద్ద సైబరాబాద్ సీపీ రమేశ్, ఐడీఎఫ్సీ ఫస్ట్బ్యాంక్జోనల్ హెడ్ ప్రశాంత్ షిండే, ఎన్ఎండీసీ పర్సనల్డైరెక్టర్ శ్రీ కృష్ణ కుమార్ ఠాకూర్, డీసీపీ కె.శిల్పవల్లి, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ వ్యవస్థాపకుడు, మారథాన్ రేస్ డైరెక్టర్ రాజేశ్