Kaizer News

OTT : ఓటీటీలోకి రీసెంట్ డివైన్ బ్లాక్ బస్టర్ అగధ..

OTT : ఓటీటీలోకి రీసెంట్ డివైన్ బ్లాక్ బస్టర్ అగధ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే

· Entertainment · tv9telugu.com

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వచ్చే వారం (సెప్టెంబర్ 25) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. థియేట్రికల్‌గా ‘అగధ’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్, డివైన్, మిస్టిక్ థ్రిల్లర్‌గా ‘అగధ’ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి పాత్రలతో పాటుగా ఇతర కారెక్టర్స్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఎం ఎస్ రాజు తెరకెక్కించిన విధానం, కెమెరా వర్క్, బీజీఎం ఇలా అన్నీ కూడా సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 తన ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి నాని చమిడిశెట్టి కెమెరామెన్‌గా, జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతాన్ని అందించారు. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News