Kaizer News

ఐదు నిమిషాల ప్రార్థనతో.. నొప్పులూ, యాంగ్జైటీ, ఆందో

ఐదు నిమిషాల ప్రార్థనతో.. నొప్పులూ, యాంగ్జైటీ, ఆందోళన దూరం!

· National - India · sakshi.com

కేవలం ఐదు నిమిషాలపాటు ప్రార్థన చేయడం వల్ల నొప్పులూ, ఉద్విగ్నతలూ, ఆందోళన వంటివి చాలావరకు తగ్గే అవకాశముందంటూ అమెరికా పరిశోధకులు నిర్వహించిన ఓ తాజా అధ్యయనం చెబుతోంది. ‘యాన్నల్స్‌ ఆఫ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం ప్రార్థనతో యాంగ్జైటీ, ఆందోళన తగ్గడం వల్ల దానికి అనుగుణంగానే నొప్పులూ చాలావరకు తగ్గవచ్చని పరిశోధకులు అంటున్నారు. తీవ్రమైన నొప్పి లేదా తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్న 180 మందిని ఈ పరిశోధన కోసం ఎంపిక చేశారు. తొలుత వైద్యులు వారిని పరిశీలించి రెండు టీములుగా విభజించారు. ఒక టీములోని వారికి శిక్షణ పొందిన వాలంటీర్స్‌ ఆధ్వర్యంలో నొప్పితో బాధపడుతున్న వారిని తాకుతూ వాళ్ల నొప్పి తగ్గడం కోసం ఐదు నిమిషాల పాటు ప్రార్థనలు చేశారు. మరో టీములోని వారికి ఐదు నిమిషాలపాటు లలిత సంగీతాన్ని వినిపించారు. సంగీతం విన్నవారితో పోలిస్తే... ప్రార్థన చేసిన వారి టీములోని సభ్యుల్లో ఎక్కువ మందికి నొప్పి తగ్గినట్లు తేలింది. రెండు వారాల తర్వాత కూడా ఈ తేడా కనిపించింది. అయితే ఆరు వారాల తర్వాత మాత్రం ఈ నొప్పి తగ్గుదల అనేది అంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పరిశోధకులు తెలిపారు. ఇక యాంగ్జైటీ, ఆందోళన విషయంలో మాత్రం ఫలితాలు మరింత కాలం వరకు బాగానే ఉన్నాయి. ప్రార్థన చేయించుకున్నవారిలో... ప్రేయర్‌ ముగిసిన వెంటనే ఆందోళన చాలావరకు తగ్గింది. ప్రార్థన వల్ల మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుని, అవి ఆరోగ్యానికి కొంత మేలుచేసి ఉండొచ్చని, అయితే ఇది సాధారణ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు చెబుతున్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News