Kaizer News

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. కొనేవారికి బ్య

Gold Rates: భగ్గుమన్న బంగారం ధరలు.. కొనేవారికి బ్యాడ్ న్యూస్.. శనివారం రోజున రేట్లు ఇవే..

· City - Hyderabad · tv9telugu.com

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో ధరలు పుంజుకుంటున్నాయి. భారత్‌పై 100 శాతం దిగుమతి సుంకాలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన క్రమంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో గోల్డ్‌లోకి పెట్టుబడులు వస్తుండటంతో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు ఎగబాకుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో, డాలర్ బలపడటంతో పసిడి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సెప్టెంబర్ 19న దేశంలో ధరలు ఎలా ఉన్నాయంటే.. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1420 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.1300 మేర పెరిగాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,840గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,990గా ఉండగా.... 22 క్యారెట్ల రేటు రూ.1,43,000 వద్ద కొనసాగుతోంది. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.5 వేలు ఒక్కసారిగా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ప్రస్తుతం రూ.2.55 లక్షలుగా ఉండగా.. శుక్రవారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతోంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News