Kaizer News

Ambati Rambabu: అంబటి రాంబాబు హెల్త్ అప్డేట్- అభిమ

Ambati Rambabu: అంబటి రాంబాబు హెల్త్ అప్డేట్- అభిమానులకు ఓ రిక్వెస్ట్..!

· City - Hyderabad · telugu.oneindia.com

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కొద్ది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.అంబటికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు స్టంట్ వేయాలని నిర్ణయించారు. తాజాగా చిన్న శస్త్ర చికిత్స చేసి ఈ మేరకు స్టంట్ అమర్చారు. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న అంబటి రాంబాబు ఇవాళ తన ఆరోగ్య పరిస్ధితిపై ట్వీట్ చేశారు. కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ? ఎప్పుడూ చురుగ్గా, చలాకీగా ఉంటూ ప్రత్యర్దులపై పంచ్ లు విసిరే అంబటి రాంబాబు ఆస్పత్రిలో చేరినట్లు తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ కుటుంబ సభ్యులు కూడా బహిరంగ ప్రకటన చేయకపోవడంతో ఆ ఆందోళన మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అంబటి చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు. దీంతో అంబటి స్వయంగా స్పందించారు. Recommended For You పల్నాడులో ఆ ఉద్యోగుల రైలుకు హాల్ట్ ఖరారు- ఆ రోజు నుంచే-టైమింగ్స్ ఇవే..! తన రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా గుండెలో రెండు బ్లాక్ లు గుర్తించడం, వెంటనే దానికి డాక్టర్ల బృందం స్టెంట్ చికిత్స ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని అంబటి రాంబాబు ఇవాళ ట్వీట్ చేశారు. తనను కలవడానికి దయచేసి ఎవరూ హైదరాబాద్ రావద్దని ఆయన కోరారు. రెండు రోజుల్లో గుంటూరు వస్తాను అక్కడ కలుసుకుందామంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో అంబటి అభిమానులు ఊపిరిపీల్చుకుంటున్నారు

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News