Kaizer News

బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్!

బంగారం ధరలు.. మూడు రోజుల్లో రూ.4,700 డౌన్!

· Business · sakshi.com

న్యూఢిల్లీ: డాలర్‌ పుంజుకోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో దేశీ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ డీలా పడ్డాయి. శుక్రవారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర 10 గ్రా. ఏకంగా రూ. 3,300 తగ్గి రూ. 1,62,400 స్థాయికి చేరింది. గడిచిన మూడు రోజుల్లోనే బంగారం ధర దాదాపు 3% (రూ. 4,700) మేర దిగొచ్చింది. మరోవైపు వెండి కిలో ధర రూ. 5,000 తగ్గి రూ. 2,45,500 వద్ద స్థిరపడింది. డాలర్‌ ఇండెక్స్‌ 99.15 స్థాయిని దాటి బలపడటం పసిడి క్షీణతకు కారణమైంది. దేశంలో స్మగ్లింగ్‌ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ (దిగుమతి సుంకం) తగ్గించే అవకాశం ఉందన్న వార్తలు దేశీయంగా ధరలను మరింత ఒత్తిడికి గురిచేశాయి. ఫెడ్‌ కఠిన సంకేతాలతో పసిడికి షాక్‌: ‘జాక్సన్‌ హోల్‌’ సదస్సులో ఫెడరల్‌ చైర్మన్‌ కెవిన్‌ వార్‌‡్ష మాట్లాడుతూ అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్దేశించుకున్న 2% లక్ష్యానికి చేరలేదన్నారు. ధరలు అదుపులోకి తీసుకురావడానికే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వడ్డీ రేట్లు మరింత కాలం అధిక స్థాయిలో కొనసాగవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో గోల్డ్‌ ధర ఔన్సుకు 3% తగ్గి 4,520 డాలర్లను, వెండి 4% క్షీణించి 66.6 డాలర్లను తాకాయి. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News