Kaizer News

Parlakhemundi: ఆర్టీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం

Parlakhemundi: ఆర్టీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం

· National - India · hmtvlive.com

పర్లాఖెముండి: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయంలో శనివారం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆర్టీవో తపన్ కుమార్ మాట్లాడుతూ భవనంలో ఉన్నటువంటి కంప్యూటర్ గది, బయోమెట్రిక్ గదుల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని, సుమారు రూ లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. భవనంలో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ఉన్న గదిలో కంప్యూటర్లు కాగితాలు అగ్నికి ఆహుతి అయ్యాయని , మంటలు చెలరేగుతున్న సమయంలో సిబ్బంది చేరుకొని అదుపు చేసినట్లు అగ్నిమాపక అసిస్టెంట్ అధికారి సుఖంత్ కుమార్ మహంత్ తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News