వెనుజులాతో డేటింట్ Andhra Prabha Top Story హోర్ముజ్ జలసంధి మూసివేతతో గల్ఫ్ చమురు సరఫరాపై అనిశ్చితి నెలకొన్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో భారీ ప్లాన్‌కు తెరతీశారు. గల్ఫ్ దేశాల చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుని.. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న వెనిజులాపై అమెరికా పట్టు బిగించేందుకు అడుగులు వేస్తున్నారు. వెనిజులా చమురు క్షేత్రాల్లో అమెరికా సంస్థలకు విస్తృత అవకాశాలు కల్పించడం ద్వారా చమురు సరఫరాను పెంచడంతో పాటు.. దేశీయంగా గ్యాసోలిన్ ధరలను తగ్గించాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ ఒప్పందం అమలైతే.. ప్రపంచ చమురు మార్కెట్‌లో అమెరికా వ్యూహం, గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, వెనిజులా భవిష్యత్తుపై గణనీయ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆరు నెలలు గడిచినా యుద్ధంలో ఇరార్ తలవంలేదు. బాంబుల వర్షానికి అదరలేదు. అగ్రనాయకుల్ని లేపేసినా బెదరలేదు. పైగా హోర్ముజ్ జలపంధిని స్వాధీనం చేసుకుంది. తాళం వేసింది. ఇదే తరుణంలె అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో .. గ్యాసోలిన్ ధరలపై వినియోగదారుల ఆందోళనలను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది చైకగా చమురు సరఫరా చేసే దేశంపై ట్రంప్ కన్ను పడింది. గల్ప్ దేశాల చమురుకు బ్రేక్ అప్ చెప్పి… వెనుజులాతో డేడింగ్ ప్రారంభించటానికి అమెరికా అధ్యశ్రీుడు టంప్ కోత్త ప్లాన్ తెరమీదకు తీసుకు వచ్చారు. అమెరికా ఉత్పత్తిదారులతో ముడి చమురు మార్పిడి అవకాశంతో సహా, దేశ చమురు నిల్వలకు ఆయన తన వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌ను తిరిగి నింపడానికి యూ.ఎస్. కూడా పరిష్కారాల కోసం చూస్తోంది. అంతులేని వెనిజులా చమురు నిల్వల్లో ఐదవ వంతును తమ నియంత్రణలోకి తీసుకునేందుకు అమెరికా ఒక అపూర్వ ప్రయత్నం చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా కంపెనీలు, ఒపెక్ దేశం వెనిజులా ఇంధన పరిశ్రమను పునరుద్ధరించగలవని, అమెరికా ఇంధన ధరలను తగ్గించడంలో సహాయపడే కొత్త ముడి చమురు వనరును అందించగలవని ఆయన ఆశిస్తున్నారు. ప్రైవేట్ వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం ద్వారా, 65 బిలియన్ బ్యారెళ్లకు పైగా వెనిజులా చమురు నిల్వలపై అమెరికా మెజారిటీ నియంత్రణను సాధించిందని చెబుతూ, ట్రంప్ ఈ ఒప్పందం గురించి కొన్ని వివరాలు మాత్రమే అందించారు. ఈ ఒప్పందం ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుందని చెబుతూ, ఆ దక్షిణ అమెరికా దేశాధినేత దీనిని స్వాగతించారు. ట్రంప్ ప్రభుత్వం వెనిజులా ఉత్పత్తిని పునరుద్ధరించడానికి అమెరికా రిఫైనరీలకు మరింత ముడి చమురును అందించడానికి ప్రయత్నిస్తున్నందున, ఈ కొత్త ఒప్పందం వెనిజులా చమురు పరిశ్రమలో అమెరికా పాత్రను నాటకీయంగా విస్తరిస్తుంది. వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది, కానీ సంవత్సరాల తరబడి పెట్టుబడుల కొరత, దుర్వినియోగం ఆంక్షల కారణంగా, దాని సామర్థ్యానికి చాలా తక్కువగా, రోజుకు కేవలం 1.25 మిలియన్ బ్యారెళ్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. “నా ఆదేశాల మేరకు, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో యుద్ధ కార్యదర్శి పీట్ హెగ్సెత్, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో కలిసి పనిచేస్తూ, ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థతో భాగస్వామ