Shorts ప్రకాశం జిల్లా: జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం బిట్రగుంట గ్రామంలో పల్లపాటి సాంబశివరావు (55), గౌడ, బిట్రగుంట గ్రామం నివాసం వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, అతని వద్ద ఉన్న Old Admiral Brandyకు చెందిన 30 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని జరుగుమల్లి పోలీసులు తెలిపారు