Kaizer News

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రెరా ప్రత్యేక స్టాల్..కొను

క్రెడాయ్ ప్రాపర్టీ షోలో రెరా ప్రత్యేక స్టాల్..కొనుగోలుదారులకు సూచనలందించిన రెరా టీమ్

· City - Hyderabad · v6velugu.com

హైదరాబాద్​, వెలుగు: ఇళ్లు, స్థలాల కొనుగోలుదారుల కోసం రెరా ఆమోదిత ప్రాజెక్టులను ఒకే దగ్గర ప్రదర్శిస్తున్న ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026’లో తెలంగాణ రెరా సంస్థ తరపున ప్రత్యేక స్టాల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. రేరా కమ్యూనికేషన్​ సెల్​ ఇన్​చార్జీ పోచారెడ్డి ఆధ్వర్యంలో టీమ్​ మెంబర్స్​ ఇక్కడికి విచ్చేసే కొనుగోలుదారులకు రెరా ఆమోదిత ప్రాజెక్టుల గురించి వివరించారు. రెరా అనుమతి పొందిన ఇళ్లను కొనుగోలు చేస్తే రెరా కల్పించే చట్టపరమైన, ఆర్థికపరమైన నియంత్రణ రక్షణల గురించి వివరిస్తూ అవగాహన కల్పించారు. అలాగే, ఎట్టి పరిస్థితుల్లోనూ రెరాలో నమోదు కాని ప్రాజెక్టులలో కొనుగోలు చేసి మోసపోవద్దని కొనుగోలుదారులకు సూచించారు. ప్రతిష్టాత్మక ‘క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026’ పేరిట 19వ ఎడిషన్ ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మాదాపూర్ సమీపంలో గల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 28న స్టార్ట్​ అయిన ప్రాపర్టీ షో ఆదివారంతో ముగిసింది. నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 60 కి పైగా ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు నిర్మించిన 300కు పైగా ప్రాజెక్టులను ఇక్కడ ఒకే వేదికపై ప్రదర్శించారు. ‘రేట్లు ఆగవు – డిమాండ్ తగ్గదు’ అనే స్లోగన్​తో ఈ ప్రదర్శనను జరుగుతోంది. ఇందులో అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ప్లాట్లు, కమర్షియల్ ల్యాండ్స్​ వంటి విభిన్న బడ్జెట్‌‌‌‌‌‌‌‌లలో అందించే ప్రాజెక్ట్​ల వివరాలను అందుబాటులో ఉంచారు. గృహ రుణాలు అందించే ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి, కొనుగోలుదారులకు స్పాట్ లోన్ గైడెన్స్, ప్రత్యేక ఆఫర్లను వివరిస్తున్నాయి. ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారు వేర్వేరు ప్రాంతాలు తిరగాల్సిన అవసరం లేకుండా, ఒకే చోట వివిధ ప్రాజెక్టుల ధరలు, లొకేషన్లు, అందులోని వసతులను పోల్చి చూసుకుని సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక చక్కని వేదికగా నిలిచింది

Original source: v6velugu.com
Read more on Kaizer News