Kaizer News

జూబ్లీహిల్స్: తాగునీటితో కారు, ఫ్లోర్ కడిగిన..ఇద్ద

జూబ్లీహిల్స్: తాగునీటితో కారు, ఫ్లోర్ కడిగిన..ఇద్దరికి రూ.30 వేలు ఫైన్

· City - Hyderabad · v6velugu.com

జూబ్లీహిల్స్, వెలుగు: తాగునీటిని వృథా చేస్తున్న ఇద్దరికి మెట్రోపాలిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీవరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు అధికారులు జరిమానా విధించారు. శనివారం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 23లో తనిఖీలు నిర్వహించారు. పూర్ణిమ అనే మహిళ తాగునీటిని ఫ్లోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లీనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాడుతుండగా గుర్తించి రూ. 20 వేలు, బోదనాపు అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తాగునీటితో కారు కడుగుతుండటాన్ని గమనించి రూ. 10 వేల జరిమానా కట్టించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి నీటిని పొదుపు చేయాలని సూచించారు. ఎక్కడైనా తాగునీరు దుర్వినియోగం అవుతుంటే ఆ వివరాలు, ఫొటోలను వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 99499 30003కు పంపించాలని కోరారు

Original source: v6velugu.com
Read more on Kaizer News