Kaizer News

Gladiators | రేసింగ్ ట్రాక్‌పై అజిత్ కుమార్ పోరాటం

Gladiators | రేసింగ్ ట్రాక్‌పై అజిత్ కుమార్ పోరాటం.. ‘గ్లాడియేటర్స్’ ట్రైలర్ విడుదల!

· Entertainment · ntnews.com

Ajith Kumar | కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సినిమాలతో పాటు మోటార్ రేసింగ్‌పై తనకున్న అంకితభావాన్ని చాటుతూ తెరకెక్కించిన స్పెషల్ డాక్యుమెంటరీ ‘గ్లాడియేటర్స్’ (Gladiators) ట్రైలర్ తాజాగా విడుదలయింది. రేసింగ్ ట్రాక్‌పై తలపడే వేగం, ఛాలెంజ్‌లను ఎదుర్కొనే గట్స్, తెరవెనుక ఆయన పడిన కష్టం, సవాళ్లు మరియు విజయాలను ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది. దర్శకుడు ఎ.ఎల్. విజయ్ (A.L. Vijay) తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు జి.వి. ప్రకాశ్ కుమార్ (G.V. Prakash Kumar) సంగీతం అందిస్తుండగా, షాలిని అజిత్ కుమార్ (Shalini Ajith Kumar) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా ప్రొఫెషనల్ మోటార్ రేసింగ్‌లో అజిత్ సాగిస్తున్న ప్రయాణాన్ని, ఆయన పడే తపనను ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించనున్నారు. ప్రస్తుతం విడుదలైన ఈ ట్రైలర్ అజిత్ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులలో భారీ అంచనాలను పెంచేసింది

Original source: ntnews.com
Read more on Kaizer News