Kaizer News

Sigma Trailer Telugu: సందీప్ కిషన్ 'సిగ్మా' ట్రైలర

Sigma Trailer Telugu: సందీప్ కిషన్ 'సిగ్మా' ట్రైలర్ రివ్యూ: 500 కోట్ల రాకెట్‌, హెయిస్ట్ యాక్షన్... విజయ్ తనయుడు ఎలా తీశాడంటే?

· Entertainment · telugu.abplive.com

సందీప్ కిషన్ 'సిగ్మా' అక్టోబరు 2న విడుదల, జేసన్ సంజయ్ దర్శకత్వం. ట్రైలర్: రూ.500 కోట్ల డ్రగ్స్, ట్రెజర్ హంట్, ఉత్కంఠ మలుపులు. సందీప్ కిషన్ రెండు షేడ్స్, సంపత్ రాజ్ బలమైన విలన్ పాత్రలు. సందీప్ కిషన్ (Sundeep Kishan) కథానాయకుడిగా నటించిన క్రేజీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'సిగ్మా' (Sigma Movie). ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. దీని స్పెషాలిటీ ఏమిటంటే... ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల చేశారు. అది ఎలా ఉందంటే? ట్విస్టులు, ట్రెజర్ హంట్‌... బావుందిగా! Sigma Trailer Review: 'సిగ్మా' ట్రైలర్‌ చూస్తే... ట్రెజర్ హంట్ నేపథ్యంలో సినిమా తీసినట్టు అర్థం అవుతోంది. డ్రగ్స్ మాఫియా, దాని వెనుక ఉన్న కింగ్‌ పిన్, రూ. 500 కోట్ల భారీ రాకెట్ చుట్టూ యాక్షన్ డ్రామాగా, క్రిమినల్ హెయిస్ట్ ఎపిసోడ్స్‌తో సినిమా రూపొందించారు. ట్రైలర్ విజువల్స్ చూస్తే... ఉత్కంఠ రేపే ట్విస్టులు, థ్రిల్స్, పవర్‌ ఫుల్ ఫైట్ సీన్స్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. .. ఆస్కార్ 2027కు ఇండియా ఎంట్రీ రెండు షేడ్స్‌ ఉన్న రోల్‌లో సందీప్ కిషన్! 'సిగ్మా' సినిమాలో కథానాయకుడు సందీప్ కిషన్ రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న రోల్ చేశారని తెలుస్తోంది. రేడియో జాకీ 'సామ్' (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమాయణం నడిపే క్యాజువల్ కుర్రాడిగా, సరదా ప్రేమికుడిగా కనిపించారు. ఆ తర్వాత మనం ఊహించని మలుపులతో మాస్ యాక్షన్ చేసే యాక్షన్ హీరో అవతార్‌లోకి షిఫ్ట్ అయ్యారు. 'ఓడిపోవడం నాకు కొత్త కాదు... కానీ ఆడబ్బా, మోసం చేసే వాళ్లను వదిలేదే లేదు' అంటూ మాస్ డైలాగ్స్ కూడా చెప్పారు. .. ఎంఎస్ రాజు తీసిన మిస్టిక్ థ్రిల్లర్‌ను ఎందులో చూడొచ్చంటే? పవర్‌ ఫుల్ విలనిజంతో పాటు మంచి కథ! 'సిగ్మా'లో కోట్లపాడి వీరయ్య రెడ్డిగా అండర్‌ వరల్డ్ డాన్ పాత్రలో సీనియర్ నటుడు సంపత్ రాజ్ పవర్‌ ఫుల్ విలనిజాన్ని చూపించారు. 'ఆయన ఆకలి కోసం వేటాడటం మొదలుపెట్టాడు... మొత్తం అడవంతా ఆయన కంట్రోల్లోనే ఉంది' అంటూ విలన్ రోల్ ఇంట్రడ్యూస్ చేశారు. రాజు సుందరం, అన్బు దాసన్, యోగ్ జేపీ, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను జేసన్ సంజయ్ తీసినట్టు అర్థం అవుతోంది. మరి అక్టోబరు 2న థియేటర్లలో విడుదలైనప్పుడు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. .. గృహప్రవేశంలో తేజస్విని ఎక్కడ? నెటిజన్స్ ప్రశ్నలు? 'సిగ్మా' సినిమా దర్శకుడు ఎవరు? ఈ చిత్రానికి దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించారు. ఇది దర్శకుడిగా ఆయనకు తొలి సినిమా. 'సిగ్మా' అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రెజర్ హంట్, డ్రగ్స్ మాఫియా, 500 కోట్ల భారీ రాకెట్ చుట్టూ తిరిగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇందులో ఉత్కంఠభరితమైన ట్విస్టులు ఉంటాయి. Up Next Up Next Up Next Up Next ఒకే రాత్రిలో మూడు హత్యలు... చెత్తలో దొరికి

Original source: telugu.abplive.com
Read more on Kaizer News