Kaizer News

Madhapur: మాధాపూర్ తమ్మిడికుంటను పరిశీలించిన హైడ్ర

Madhapur: మాధాపూర్ తమ్మిడికుంటను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్!

· City - Hyderabad · hmtvlive.com

Shorts మాధాపూర్‌: మాధాపూర్‌లోని ప్రముఖ తమ్మిడికుంట చెరువును హైడ్రా (HYDRAA) కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు వద్దకు వాకింగ్ కోసం వచ్చిన స్థానికులతో కమిషనర్ కాసేపు ముచ్చటించారు. వాకింగ్ సరిహద్దుల ప్రజలు చెరువు సంరక్షణపై పలు కీలక సూచనలు చేశారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని కోరారు. అలాగే పరిసరాల్లో ఆహ్లాదాన్ని పంచే నీడనిచ్చే చెట్లతో పాటు మెడిసినల్ ప్లాంట్లు (ఔషధ మొక్కలు) నాటాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ.. గతంలో ఆక్రమణల వల్ల కేవలం 14 ఎకరాలకు పరిమితమైపోయిన తమ్మిడికుంటను, అక్రమ నిర్మాణాలను తొలగించి *30 ఎకరాలకు విస్తరించామని స్పష్టం చేశారు. అన్ని వయసుల వారికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించేలా పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. చెరువు ఆక్రమణలను తొలగించి, రూపురేఖలు మార్చి సుందరీకరిస్తున్న హైడ్రా చర్యలపై స్థానిక వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News