మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పెద్దగా హంగామా లేకుండా, తక్కువ పాత్రలతోనే ఉత్కంఠను పెంచుతూ కథను నడిపించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి సినిమాల్లో ‘ఏలా వీజా పూంచిర’ కూడా ఒకటి. సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు షాహీ కబీర్ దర్శకత్వం వహించారు. 2022లో విడుదలైన ఈ చిత్రం ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే.. కొట్టాయం పరిధిలోని ఓ పర్వత ప్రాంతంలో ఏర్పాటు చేసిన వైర్లెస్ ఏఆర్ పోలీస్ క్యాంప్ చుట్టూ కథ మొదలవుతుంది. అక్కడ మధు అనే పోలీస్ అధికారి విధులు నిర్వహిస్తుంటాడు. అందమైన ప్రకృతి మధ్య ఉన్న ఈ ప్రాంతం మరోవైపు చాలా ప్రమాదకరమైనది. తరచూ పిడుగులు పడటంతో వైర్లెస్ సెట్‌లు పనిచేయకపోవడం, వాతావరణం అకస్మాత్తుగా మారిపోవడం అక్కడి పోలీసులకు సాధారణ సమస్యలుగా ఉంటాయి. మధు క్యాంప్‌కు వచ్చిన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభు వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోతాడు. అతని స్థానంలో సుధీ అక్కడికి వస్తాడు. ఇద్దరి మధ్య నెమ్మదిగా స్నేహం ఏర్పడుతుంది. మధు అతనికి భోజనం తయారు చేసి పెడుతుంటే, సుధీ తన దగ్గరున్న మద్యాన్ని అతనితో పంచుకుంటూ ఉంటాడు. మరోవైపు సుధీకి పెళ్లి కూడా నిశ్చయమవుతుంది. కాబోయే భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ అతను అక్కడి ఒంటరితనాన్ని గడుపుతుంటాడు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలోనే చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా మానవ శరీర భాగాలు బయటపడటం కలకలం రేపుతుంది. కాళ్లు, పాదాలు, చేయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న తల ఇలా ఒక్కొక్కటిగా లభిస్తాయి. చివరకు హత్యకు గురైంది ఓ మహిళ అని పోలీసులు నిర్ధారిస్తారు. ఆమె ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? హత్య వెనుక ఉన్నది ఎవరు? అనే ప్రశ్నలు మొదలవుతాయి. ఈ కేసుకు సంబంధించిన సమాచారం వైర్లెస్ ద్వారా మధు, సుధీలకు కూడా చేరుతుంటుంది. ఓ రోజు క్యాంప్ సమీపంలో నేల నుంచి బయటకు కనిపిస్తున్న ఓ నరికిన చేయిని సుధీ గమనిస్తాడు. ఆ దృశ్యం అతన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేస్తుంది. ఆ చేయి అక్కడికి ఎలా వచ్చింది? దాని వెనుక మధు పాత్ర ఏంటి? అనే అనుమానం అతనిలో మొదలవుతుంది. సుధీ ఆ చేయిని చూడటం మధు కూడా గమనిస్తాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య చోటుచేసుకునే పరిణామాలే కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దాని వాతావరణం, లొకేషన్స్ అని చెప్పొచ్చు. పర్వత ప్రాంతంలోని ఒంటరితనం, మారుతున్న వాతావరణం, పోలీస్ క్యాంప్ చుట్టూ ఉండే నిశ్శబ్దం కథలో టెన్షన్‌ను పెంచుతాయి. పెద్దగా పాత్రలు లేకపోయినా, ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఫస్టాఫ్‌లో హత్యకు సంబంధించిన మిస్టరీని నెమ్మదిగా పరిచయం చేసిన దర్శకుడు, సెకండాఫ్‌లో అదే మిస్టరీని మరింత సంక్లిష్టంగా మార్చారు. కథ ముగింపుకు చేరుకునే సమయంలో వచ్చే ట్విస్ట్ సినిమాకు మరో బలాన్ని చేకూరుస్తుంది. అప్పటివరకు సాధారణ క్రైమ్ థ్రిల్లర్‌లా అనిపించిన కథ ఒక్కసారిగా మరో కోణంలోకి వెళ్లడం ఆసక్తిని పెంచుతుంది. సౌబిన్ షాహిర్ తన నటనతో ఆకట్టుకున్నారు. మణేష్ మాధవన్ కెమెరా పనితనం, అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం సిని