దేశవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న వేళ.. ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రైడ్‌కు వెళ్లిన అధికారి లంచం తీసుకున్నాడని ఆరోపిస్తూ జనం భలే శిక్ష విధించారు. అక్కడ తప్పు జరగలేదని ఆ అధికారి బుకాయించే యత్నం చేయగా.. అది కరెక్ట్ అయితే నిరూపించమంటూ ఒత్తిడి చేశారు. దీంతో ఆ అధికారి నీళ్లు మింగాల్సి వచ్చింది. తుకారాం ముండే ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర లో ఫుడ్ సేఫ్టీ విషయంలో ఆయన నేతృత్వంలో జరుగుతున్న సోదాలు.. తీసుకుంటున్న చర్యలు.. కంట్రోల్‌లో ఉండాలంటూ కోర్టులు ఆదేశిస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరూ.. ఇవన్నీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నవే. అలాంటి రాష్ట్రంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఛత్రపతి సంభాజీనగర్‌లో వైజాపూర్ ఏరియాలో ఓ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనిఖీల్లో పట్టుబడిన ఎక్స్‌పైరీ(కాలం చెల్లినవి) బిస్కెట్లను అధికారితోనే తినిపించేందుకు స్థానికులు ప్రయత్నించడం నెట్టింట వైరల్ అయ్యింది. ఓ దుకాణదారుడిని కాపాడే క్రమంలో ఆయన లంచం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జనం ఈ పని చేయబోయారు. స్థానికంగా ఓ దుకాణంలో తినుబండారాలు తిన్న రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురైంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌డీఏ అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నేపథ్యంలో ఓ అధికారి దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లగా.. అప్పటికే చిన్నారి తిన్నట్లు చెబుతున్న స్నాక్ మిక్స్‌ను దుకాణం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయితే తనిఖీల్లో కొన్ని ఎక్స్‌పైరీ బిస్కెట్ ప్యాకెట్లు బయటపడ్డాయట. వాటిని తమ వాహనంలో పెట్టిన అధికారులు.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన జనం.. ఆ అధికారి చుట్టూ చేరారు. దుకాణానికి సీజ్ వేయకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ నిలదీశారు. దానికి ఆ అధికారి తనిఖీల్లో ‘అంతా సవ్యం’గానే ఉందని చెప్పాడు. దీంతో వాహనం నుంచి ఆ బిస్కెట్లను తీసుకున్న స్థానికులు ‘బిస్కెట్లు సురక్షితమే అయితే మీరే తినండి’ అంటూ నోట్లో కుక్కేందుకు ప్రయత్నించారు. దాంతో నమల్లేక.. మింగలేక.. కక్కలేక ఆ అధికారి పడ్డ అవస్థలు పడ్డ వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రస్తుతం FDA కమిషనర్ తుకారాం ముండే నేతృత్వంలో ఆహార భద్రతపై భారీ స్థాయిలో తనిఖీలు, దాడులు జరుగుతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్లు, డెయిరీలు, క్యాంటీన్లు, ఫుడ్ డెలివరీ సంస్థలు సహా వివిధ ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు గుర్తిస్తే లైసెన్సులు సస్పెండ్ చేయడం, నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ఆహార భద్రతను కాపాడాల్సిన అధికారులపై ఇలాంటి ఆరోపణలు రావడం, అదే సమయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికారిని అవమానించే స్థాయికి వెళ్లడం కలకలం రేపింది. ఇదీ చదవండి: ఆ పుస్తకం చదవాల్సిన అవసరం ఏమొచ్చింది? ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (