మలయాళ ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ భామ అనస్వర రాజన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది. క్యూట్ లుక్స్, సహజసిద్ధమైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ త్వరలోనే ఇక్కడ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం కాకా . బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ K నారాయణ నిర్మిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో అనస్వర రాజన్ చిరంజీవి కూతురుగా కనిపించనుంది. కాకా కాకుండా అనస్వర నటిస్తోన్న ఇంకో సినిమా ఇట్లు అర్జున. యంగ్ యాక్టర్ అనీష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తుండగా, దర్శకుడు వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలు కాకుండా గోదావరి నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అంతా రాములోరు చూసుకుంటారు చిత్రంలో కూడా అనస్వరనే హీరోయిన్. మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కుమారి 21ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, VGB ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర శిరీష అనే పాత్రలో కనిపించనుంది. ఇలా వరుస ప్రాజెక్టులతో తెలుగులో బీజీ అయింది ఈ మలయాళ బ్యూటీ. మరి ఈ సినిమాలతో ఈ అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి. బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!