Kaizer News

ఉగ్రకార్యకలాపాలకు పోర్న్‌వెబ్‌సైట్లు

ఉగ్రకార్యకలాపాలకు పోర్న్‌వెబ్‌సైట్లు

· National - India · sakshi.com

శ్రీనగర్‌/న్యూఢిల్లీ: భద్రతా బలగాల నిఘా పెరుగుతున్న కొద్దీ ఉగ్ర మూకలు తమ ఉగ్రవాదాన్ని మరింతగా విస్తరించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. మొన్నమొన్నటి వరకు ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ల మాటున కార్యకలాపాలను కొనసాగించిన ఉగ్ర ముఠాలు ఇప్పుడు కొత్తగా పోర్న్‌ వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నాయి. సమాచారాన్ని రహస్యంగా ఇచ్చిపుచ్చుకునేందుకు, జమ్మూకశ్మీర్‌లో కొత్తవారిని చేర్చుకునేందుకు ఉగ్ర ముఠాలు, పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కొత్తగా పోర్నోగ్రఫీ యాప్‌లను, ప్రత్యేక ఎన్‌క్రిపె్టడ్‌ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు ఆదివారం వెల్లడించారు. సంప్రదాయ సామాజిక మాధ్యమ వేదికలపై భారత నిఘా సంస్థలు కన్నేసి ఉంచడంతో ఈ కొత్త దారిని అనుసరిస్తున్నారన్నారు. ఈ పోర్నోగ్రఫీ వేదికల్లో సమీపంలోని డేటింగ్‌ భాగస్వాములను వెతుక్కోవడానికి సాయపడే ’రియల్‌–టైమ్‌’ చాట్‌ టూల్స్‌ ఉంటాయి. ఉగ్రవాద హ్యాండ్లర్లు ఈ వెసులుబాటును తమ మధ్య సందేశాలను భట్వాడాకు, కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఫ్రాన్స్‌కు చెందిన ఒక యాప్‌ వంటి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే ప్లాట్‌ఫామ్‌లను ఉగ్రమూకలు ఉపయోగిస్తున్నాయి. ఈ యాప్‌ ఎలాంటి సిమ్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ అవసరం లేకుండానే ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్‌క్రిపె్టడ్‌ మెసేజింగ్‌ను అనుమతిస్తుంది. దీంతో ఈ యాప్‌ను ఎక్కడి నుంచి ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది గుర్తించడం చాలా కష్టం. రిజి్రస్టేషన్‌ ప్రక్రియతో పనిలేని చైనాకు చెందిన మూన్‌చాట్‌ వంటి అనామక ప్లాట్‌ఫామ్‌లతో పాటు వియత్నాంలో ఉపయోగించే యాప్‌లను ఈ ఉగ్రవాద సంస్థ సభ్యులు వాడుతున్నట్లు తేలింది. ఈ యాప్‌లను 2జీ నెట్‌వర్క్‌లోనూ సులువుగా వాడుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. నిఘా వర్గాలను ఏమార్చేందుకు పహల్గాం దాడి సమయంలో ముష్కరులు ఇలాంటి వాడుకున్నట్లు గుర్తించామన్నారు. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News