నేచురల్ స్టార్ నాని , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ది ప్యారడైజ్'. 'దసరా' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కలయికలో వస్తున్న రెండవ సినిమా ఇది. సెప్టెంబర్ 24, 2026న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్ తదితర భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సొనాలీ కులకర్ణి, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు