Kaizer News

Hyderabad: అబిడ్స్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్

Hyderabad: అబిడ్స్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Hyderabad: మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా స్వావలంబులను చేయడమే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని అబిడ్స్ జీపీఓ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళలు నిర్వహించే క్యాంటీన్లకు ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేలా క్యాంటీన్లు పనిచేయాలని సూచించారు. అనంతరం మహిళలతో కలిసి ఎంపీ అల్పాహారం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News