Kaizer News

పాపం సంజూ..! వైభవ్‌ సూర్యవంశీ దెబ్బకు కెరీర్ ఊహించ

పాపం సంజూ..! వైభవ్‌ సూర్యవంశీ దెబ్బకు కెరీర్ ఊహించని మలుపు!

· National - India · sakshi.com

శ్రీలంక‌తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20ల్లో అఫ్గానిస్తాన్‌తో త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మైంది. న్యూఢిల్లీ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 13 నుంచి భార‌త్‌-అఫ్గానిస్తాన్ మ‌ధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ సెలక్ష‌న్ క‌మిటీ సెప్టెంబ‌ర్ 3న ప్ర‌క‌టించనున్నారు. అయితే జింబాబ్వే టూర్‌కు దూరమైన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్‌ను స్క్వాడ్‌లోకి తీసుకున్నా తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే ఓపెనర్‌గా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తనను నిరూపించుకున్నాడు. మరోసారి భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు ప్రారంభించే అవకాశముంది. అలాగే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌కే యాజమాన్యం మొగ్గు చూపుతుండటంతో, సంజూ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. ఒకవేళ వైభవ్‌ లేదా ఇషాన్‌ విఫలమైతే శాంసన్‌కు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కనుంది. మరోవైపు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు మాత్రం పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక పేస్ బౌలింగ్ బాధ్య‌త‌ల‌ను అర్ష్‌దీప్ సింగ్ లీడ్ చేయ‌నున్నాడు. జింబాబ్వే టూర్‌కు దూరంగా ఉన్న అర్ష్‌దీప్ అఫ్గాన్ సిరీస్‌తో పున‌రాగ‌మ‌నం చేయ‌నున్నాడు. రీఎంట్రీలో ఆకట్టుకున్న యువ ఫాస్ట్ బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ త‌న స్ధానాన్ని నిల‌బెట్టుకోనున్నాడు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ విభాగంలో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌విబిష్ణోయ్‌లకు చోటు ద‌క్క‌నున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అఫ్గానిస్తాన్‌తో టీ20లకు భారత జట్టు(అంచనా) శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్ చదవండి: 11వ స్ధానంలో సరికొత్త చరిత్ర.. ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రికార్డ్‌ ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు.. రౌడీషీటర్ కమ్మసాయి దారుణ హత్య.. అసలేం జరిగింది..?

Original source: sakshi.com
Read more on Kaizer News