LB Nagar: దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్బీనగర్‌లో సమర శంఖారావం నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “దివ్యాంగులకు బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.. అది లేదు. నెలకు రూ.6 వేల పింఛన్ ఇస్తామని చెప్పారు.. అదీ లేదు. గ్యారెంటీ కార్డులో ఉన్న హామీలనే అమలు చేయాలని అడుగుతున్నాం. కొత్త కోర్కెలు కోరడం లేదు” అని హరీశ్‌రావు అన్నారు. “ఎన్నికల ముందు బాండ్ పేపర్లపై రాసిచ్చి.. గ్యారెంటీ కార్డులు పంచారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు 100 రోజులు కాదు 1000 రోజులు దాటినా హామీలు పూర్తిగా అమలు కాలేదు. మీరే చెప్పిన మాటలను అమలు చేయాలని అడుగుతున్నాం” అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. “పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్నారు. రైతులు యూరియా, విద్యుత్, రైతుబంధు కోసం ధర్నాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు” అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక మాయమాటలు చెప్పిందని ఆరోపించారు. “ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు కమీషన్లు లేనిదే పనులు జరగడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి కాంట్రాక్టులు, కమీషన్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు” అని హరీశ్‌రావు అన్నారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “దివ్యాంగులకు పింఛన్ ఎప్పుడు పెంచుతారు? మూడు శాతం రిజర్వేషన్ ఎప్పుడు అమలు చేస్తారు? బ్యాక్‌లాగ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు? డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “దివ్యాంగుల సత్తా ఏంటో త్వరలో చూపిస్తాం. వారి హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని హరీశ్‌రావు హెచ్చరించారు. దివ్యాంగుల సమస్యను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని హరీశ్‌రావు తెలిపారు. “సెప్టెంబర్ 7న అసెంబ్లీలో దివ్యాంగుల సమస్యపై గట్టిగా లేవనెత్తుతా. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తా” అని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రారంభం మాత్రమేనని.. దివ్యాంగుల హక్కుల కోసం మరింత పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందని హరీశ్‌రావు తెలిపారు. “గ్యారెంటీ కార్డులో ఉన్