Kaizer News

5 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. కట్‌చేస్తే.

5 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ.. కట్‌చేస్తే.. బీసీసీఐ స్కెచ్‌తో ఆర్సీబీకి కోట్లల్లో లాస్..?

· National - India · tv9telugu.com

భారత జట్టులోకి తిరిగి రావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్రునాల్ పాండ్యాకు మరోసారి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడిని టీమిండియాలోకి తీసుకునే విషయాన్ని సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఐపీఎల్‌ 2027కు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మాత్రం భారీ ఎదురుదెబ్బ తగలనుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ముగియడంతో భారత జట్టు తదుపరి టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టింది. సెప్టెంబర్‌ 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు త్వరలో సమావేశం కానున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ పర్యటనల్లో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జట్టు ఎంపికలో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో క్రునాల్‌ పాండ్యా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..! ఇంగ్లండ్‌ పర్యటనలో అక్షర్‌ పటేల్‌ ప్రదర్శనపై సెలెక్టర్లు సంతృప్తిగా లేరని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. దీంతో మెరుగ్గా రాణిస్తున్న ఎడమచేతి వాటం స్పిన్నర్లను పరిశీలిస్తున్న సెలెక్టర్ల దృష్టిలో క్రునాల్‌ ముందువరుసలో ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2026లో క్రునాల్‌ తన సత్తా చాటాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 226 పరుగులు చేయడంతో పాటు 15 ఇన్నింగ్స్‌ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనే అతడికి జాతీయ జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలను పెంచినట్లు తెలుస్తోంది. క్రునాల్‌ పాండ్యా టీమిండియాలోకి తిరిగి వస్తే అతడి వ్యక్తిగతంగా ఇది గొప్ప వార్తే. కానీ RCBకి మాత్రం ఆర్థికంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఐదేళ్లకు పైగా భారత జట్టు తరపున ఆడని క్యాప్డ్‌ ఆటగాడిని ఫ్రాంచైజీ కొన్ని పరిస్థితుల్లో అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా రిటైన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. క్రునాల్‌ చివరిసారిగా భారత్‌ తరపున 2021 జులైలో ఆడాడు. అందువల్ల 2027 సీజన్‌ వరకు జాతీయ జట్టులోకి తిరిగి రాకపోతే.. RCB అతడిని అన్‌క్యాప్డ్‌ ఆటగాడిగా కేవలం రూ.4 కోట్లకు రిటైన్‌ చేసుకునే అవకాశం ఉండేది. ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..? ప్రస్తుతం RCBకి క్రునాల్‌ పాండ్యా ధర రూ.5.75 కోట్లు. ఒకవేళ అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో అతడు భారత్‌ తరపున బరిలోకి దిగితే.. ఆ అన్‌క్యాప్డ్‌ ప్రయోజనం RCBకి దక్కదు. దీంతో ఫ్రాంచైజీ అతడిని రిటైన్‌ చేసుకోవాలంటే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి రావచ్చు. ఇదే సమయంలో క్రునాల్‌ సోదరుడు హార్దిక్‌ పాండ్యా కూడా తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న హార్దిక్‌ అఫ్గానిస్థాన్‌ సిరీస్‌కు అందుబాటులో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే.. చాలా కాలం తర్వాత హార్దిక్‌, క్రునాల్‌ పాండ్యా సోదరులు మళ్లీ టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ను పంచుకునే అవకాశం ఉంటుంది. అయితే క్రునాల్‌ పాండ్యా టీమిండియాలోకి త

Original source: tv9telugu.com
Read more on Kaizer News