Kaizer News

Jana Sena | మున్సిపల్ ఎన్నికలకు జనసేన సిద్ధం.. ఈ మ

Jana Sena | మున్సిపల్ ఎన్నికలకు జనసేన సిద్ధం.. ఈ మూడు కార్పొరేషన్లలో బరిలోకి..!

· City - Hyderabad · ntnews.com

Jana Sena : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీకి సిద్ధమవుతోంది. వచ్చే ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నామని జనసేన అధికార ప్రతినిధి తళ్లూరి రామ్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని ఆదివారం ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోనూ పోటీకి సిద్ధమవుతున్న జనసేన పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ బలంగా పోటీ చేస్తుందని ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. హైదారబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆదివారం జనసేన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. ఎన్నికల్లో పోటీకి జనసేన శ్రేణులు సిద్ధమవ్వాలని, జనసేన పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తళ్లూరి రామ్ సూచించారు. అనంతరం.. రాష్ట్ర ఇన్‌చార్జి వేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం దక్కుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన సూచించారు. ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్‌కే నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రాజకీయ భవితవ్యానికి ఈ ఎన్నికలే దిక్సూచి కానున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, మచ్చ సుధాకర్, ముమ్మారెడ్డి ప్రేమ్‌ కమార్, గడల శ్రీనివాస్, అల్లాడి తనీష్,.. అధికార ప్రతినిధులు ప్రేమ్ గాంధీ, హైందవి రెడ్డి, కావ్య, నిహారిక, నివిత.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జనసేన నాయకులు, పోటీ చేయనున్న అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలు, పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బలంగా పోటీ చేస్తుంది – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ pic.twitter.com/hdNAYlIdZd

Original source: ntnews.com
Read more on Kaizer News