డైవర్షన్ అండ్ అటాక్ గేమ్’తో ప్రతిపక్షాన్ని డిఫెన్స్‌లోకి నెట్టడంలో విజయం పొలిటికల్ ట్రాప్‌లో చిక్కుకుని కేటీఆర్, హరీష్ సహా బీఆర్‌ఎస్ సభ్యులంతా సస్పెండ్ దీంతో ప్రతిపక్షంగా సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యల అజెండా అస్తవ్యస్తం కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చిందంటున్న రాజకీయ విశ్లేషకులు ఫామ్‌హౌస్ భూముల విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతల్లో ఆందోళన, ఆగ్రహం భూ అక్రమాలు జరిగినా, జరగకున్నా రాజకీయంగా దెబ్బ తీయాలన్నది కాంగ్రెస్ కుతంత్రం రేవంత్ దూకుడుకు ముకుతాడు వేసే ప్రతివ్యూహంలో బీఆర్‌ఎస్ అగ్రశ్రేణి నేతలు కేటీఆర్, హరీష్ సహా ట్రబుల్ షూటర్లుగా రంగంలోకి దిగనున్న డజను మంది నేతలు కాంగ్రెస్ అగ్రనేతల భూదందాలపై నిఘా పెట్టి బండారం బయటపెట్టేందుకు ప్రయత్నాలు అధినేతకు మద్ధతుగా జిల్లాల వారీగా రంగంలోకి బీఆర్‌ఎస్ ఉద్యమ నేతలు సమీప భవిష్యత్తులో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయం మరింత ముదిరే అవకాశాలు హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్ బ్యూరో : అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న రాజకీయ యుద్ధ వ్యూహాలు, ప్రత్యక్ష పోరాటాలు ఇప్పట్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ఇరు పక్షాల్లోనూ తగ్గేదేలేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారం చేతుల్లో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యూహాల్లో బీఆర్‌ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకరి అక్రమాలను మరొకరు వేలెత్తి చూపుతూ భూ దోపిడీ వ్యవహారాన్ని ఎవరి కోణాల్లో వారు బహిర్గతం చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు ప్రజల్లో చులకన భావాన్ని పెంచేస్తున్నాయి. ఇరు పార్టీలు రాజకీయంగా బురదజల్లుకోవడమే కాదు.. ఇరువురు ఉద్దండులు తమతమ అక్రమాల పుట్టను తవ్వుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల విచారణ నేపథ్యంలో నేతలు, కార్యకర్తల్లో అయోమయం, ఆందోళన క్రమక్రమంగా పెరుగుతోంది. వాస్తవ పరిస్థితులు ఎలాగున్నా.. భూ అక్రమాలు జరిగినా, జరగకున్నా.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా దెబ్బ తీయాలన్న కోణంలోనే అధికార కాంగ్రెస్ కుతంత్రం అమలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన సమయమొచ్చిందంటూ ఒకప్పటి ఉద్యమ నేతలు, బీఆర్‌ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ”బీఆర్‌ఎస్ అగ్రనేతల భూ అక్రమాల వ్యవహారం ఇదిగో..” అంటూ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చిన అధికార కాంగ్రెస్, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్రనేతల వ్యవహారాన్ని మరిచిపోతున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. రేవంత్ దూకుడుకు ముకుతాడు వేసే ప్రతివ్యూహంలో బీఆర్‌ఎస్ అగ్రశ్రేణి నేతలు నిమగ్నమై పనిచేస్తున్నారు. కేటీఆర్, హరీష్ సహా ట్రబుల్ షూటర్లుగా దాదాపు డజను మంది నేతలు రంగంలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేవలం రేవంత్ రెడ్డి అనుచరవనర్గమే కాదు.. కీలక పదవుల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ అగ్రనేతల భూదందాలపై నిఘా పెట్టి బండారం బయటపెట్టేందుకు జిల్లాల వారీగా బీఆర్‌ఎస్ ఉద్యమ నేతలు రంగంలోకి దిగినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ వ్యవహారం చూస్తుంటే, సమీప భవిష్యత్తులో అధికార, ప్రతిపక్షాల మధ్య