Kaizer News

పూల వనమై మురిసిన బెల్లంపల్లి నేషనల్ హైవే!

పూల వనమై మురిసిన బెల్లంపల్లి నేషనల్ హైవే!

· City - Hyderabad · prabhanews.com

చంద్రపూర్ – హైదరాబాద్ రహదారిపై కనువిందు చేస్తున్న పసుపు వర్ణ శోభ బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : చంద్రపూర్ – హైదరాబాద్ మార్గంలోని బెల్లంపల్లి నేషనల్ హైవే పరిసరాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. బెల్లంపల్లి సమీపంలో నేషనల్ హైవేకి ఇరువైపులా నాటిన పూల మొక్కలు విరబూసి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని ఆకుల నడుమ పసుపు వర్ణంలో విరబూసిన పూల వరుసలు బెల్లంపల్లి నేషనల్ హైవేకి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. రహదారి వెంట కిలోమీటర్ల మేర పరుచుకున్న ఈ పూల తోరణాలు ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బెల్లంపల్లి నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు ఈ పూల వనం కంటికి ఇంపుగా, అలసటను మరిపించేలా ఉంది. పచ్చదనం, పూల అందాలతో బెల్లంపల్లి నేషనల్ హైవే రూపురేఖలే మారిపోయాయని స్థానికులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News