Kaizer News

Serilingampally: బొటానికల్ గార్డెన్ - మసీదు బండ రో

Serilingampally: బొటానికల్ గార్డెన్ - మసీదు బండ రోడ్డు విస్తరణ పనుల పరిశీలన!

· City - Hyderabad · hmtvlive.com

Serilingampally: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బొటానికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు రూ.1 ఒక కోటి రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు తో కలిసి పరిశీలించిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, ట్రాఫిక్ కష్టాల నుండి గట్టెక్కించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యామ్నాయ రహదారుల పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది అని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు. బొటానికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు నిత్యం వేలాది వాహనాలతో తీవ్ర రద్దీ ప్రాంతం అని, పాఠశాలలకు,కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు, ఆఫీస్ లకు వెళ్ళే ఉద్యోగస్తులకు,నిత్యం పని మీద వెళ్ళే వారికి తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని, ప్రజల ట్రాఫిక్ కష్టాలను గట్టెక్కించే విధంగా చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, నేటి తో ట్రాఫిక్ సమస్య తిరునని, ప్రజలకు ఉపశమనం లభించునని, రోడ్డు విస్తరణ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మందికి ఉపశమనం లభించునని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు . బోనాటనికల్ గార్డెన్ నుండి మసీదు బండ వరకు రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కెల చూడాలని,రోడ్డు విస్తరణ పనులలో వేగం పెంచాలని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని , టౌన్ ప్లానింగ్, CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని PAC చైర్మన్ గాంధీ గారు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో CMC ఇంజనీరింగ్ విభాగం DE ఆనంద్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చాంద్ పాషా,భూపేశ్వర్,భాస్కర్ రెడ్డి, బాలకృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News