Kaizer News

లింగాపూర్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

లింగాపూర్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

· National - India · prabhanews.com

మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులు.. విద్యార్థులకు క్రీడా పోటీలు కడెం, ఆంధ్రప్రభ: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని కడెం మండలం లింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు భూమేశ్వర్, భౌతిక విద్యా ఉపాధ్యాయుడు నెమలికొండ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ భారత హాకీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత క్రీడాకారుడని ఉపాధ్యాయులు కొనియాడారు. ఆయన అద్భుతమైన హాకీ నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని, భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ధ్యాన్‌చంద్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయుడు బాలాజీ, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News