సెప్టెంబర్ నెలలో ప్రయాణం చేయాలనుకునే వారికి భారత్‌లోని కొన్ని ప్రాంతాలు అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి. వర్షాకాలం నెమ్మదిగా ముగుస్తున్న సమయంలో కొండలు, లోయలు, సరస్సులు, జలపాతాలు, టీ తోటలు పచ్చదనంతో కళకళలాడుతుంటాయి. మరోవైపు, పీక్ హాలిడే సీజన్‌తో పోలిస్తే పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రశాంతంగా ప్రదేశాలను ఆస్వాదించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు, రవాణా వంటి వాటిపై కూడా మెరుగైన డీల్స్ లభించే అవకాశం ఉంటుంది