Kaizer News

నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌లో రియల్టీ జోరు

నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌లో రియల్టీ జోరు

· City - Hyderabad · sakshi.com

సాక్షి, సిటీబ్యూరో: గృహ కొనుగోలుదారులు ఎవరికైనా సరే వారి తొలి ప్రాధాన్యం.. తాము కొనబోయే ఇంటికి సమీపంలో స్కూల్, ఆసుపత్రి, రవాణా సదుపాయాలు ఉన్నాయా? లేవా? అనేవే! ఆ తర్వాత షాపింగ్‌ మాల్, ఇతరత్రా సౌకర్యాలను చూస్తారు. వీటన్నింటికీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా మారింది నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌. పారిశ్రామిక కేంద్రం నుంచి గ్రీన్‌ నివాస ప్రాంతంగా బాలానగర్‌ – కూకట్‌పల్లి వై జంక్షన్‌ అభివృద్ధి చెందింది. ‘లైవ్, వర్క్, ప్లే’లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. హైదరాబాద్‌ నగరం విస్తరిస్తున్న కొద్దీ నివాస గృహాల అవసరాలు మారుతున్నాయి. ఒకప్పుడు రక్షణ రంగానికి, భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు నిలయంగా ఉన్న నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు పచ్చని వాతావరణం, ఆధునిక సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అద్భుత కనెక్టివిటీతో శరవేగంగా ఐటీ, ప్రీమియం నివాస హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు బాలానగర్‌ అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ పరిశ్రమలకు ప్రసిద్ధి. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, ఆజాద్‌ ఇంజనీరింగ్‌ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలుగా నిలిచాయి. అయితే నగరీకరణ పెరుగుతుండటంతో ప్రభుత్వం పారిశ్రామిక యూనిట్లను ఔటర్‌ రింగ్‌ రోడ్‌ అవతలకు తరలించింది. దీంతో బాలానగర్‌లోని పారిశ్రామిక స్థలాలు రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ల పునర్నిర్మాణానికి అనువుగా మారాయి. పచ్చని పార్కులు, పర్యావరణ అనుకూల వసతులతో ఈ ప్రాంతమిప్పుడు కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు చిరునామాగా మారింది. మెరుగైన రవాణా సదుపాయాలు.. నార్త్‌ సెంట్రల్‌ హైదరాబాద్‌లో నివసించే వారికి ఏ ప్రాంతానికైనా సులువుగా చేరుకునేలా కనెక్టివిటీ ఉండటం అతిపెద్ద వరం. నగరంలోని ప్రధాన ఐటీ హబ్‌ అయిన హైటెక్‌ సిటీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన జీనోమ్‌ వ్యాలీకి కూకట్‌పల్లి–బాలానగర్‌ అత్యంత సమీపంలో ఉంది. కైత్లాపూర్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రావడంతో మాదాపూర్, హైటెక్‌ సిటీలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. అలాగే బాలానగర్‌ మెట్రో స్టేషన్‌ ద్వారా ఇక్కడ్నుంచి హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, హెచ్‌ఐసీసీలకు వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. నగర కేంద్రంలో ఉండటం వల్ల కూకట్‌పల్లి వై జంక్షన్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్‌ స్టేషన్‌లకు చేరుకోవడం సులభం. ఎన్‌హెచ్‌–44 , ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ద్వారా శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణం. విద్య, వైద్య, వినోద కేంద్రాలు కూడా.. ప్రపంచ స్థాయి సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లతో బాలానగర్‌ ప్రాంతం అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తోంది. ఇంటికి చేరువలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు ఉండటంతో పిల్లలకు పాఠశాలకు వెళ్లే ప్రయాణ సమయం తగ్గి చదువుపై దృష్టి పెట్టడానికి, తల్లిదండ్రులకు భద్రతా భావం కలగడానికి తోడ్పడుతుంది. అలాగే అంతర్జాతీయ ఆసుపత్రులూ ఈ ప్రాంతంలో ఉండటంతో అధునాతన వైద్య పరిజ్ఞానం, వైద్య నిపుణులతో సమగ్ర చికిత్స ఇక్కడే అందుబాటులో ఉంది. ఇక, వీకెండ్‌ వస్తే కుటుంబ సమేతంగా సరదాగా గడపడం, వీకెండ్‌ వినోదం కోసం బాలానగర్‌ ప్రాంతంలో అనేక మాల్స్

Original source: sakshi.com
Read more on Kaizer News