Kaizer News

3000-Missing-626-Dead-Nepal-Floods : ఫ్లీజ్‌..హెల్

3000-Missing-626-Dead-Nepal-Floods : ఫ్లీజ్‌..హెల్ప్ టెక్నక‌ల్లీ Andhra Prabha Top News

· National - India · prabhanews.com

ఫ్లీజ్‌..హెల్ప్ టెక్నక‌ల్లీ Andhra Prabha Top News వరద పోయినా.. ముప్పు పోలేదు! నేపాల్‌లో హిమానీనద విపత్తు సృష్టించిన విలయం నుంచి కోలుకోకముందే మరో పెను ప్రమాదం పొంచి ఉంది. దాదాపు 3,000 మంది గల్లంతు.. 626 మంది మృతి.. ఊళ్లకు ఊళ్లు మాయం. ఎగువన ఏర్పడిన సరస్సులు గట్లు తెంచుకుంటే ‘ద్రవ కాంక్రీటు’లా దూసుకొచ్చే వరద మరింత విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాంకేతిక సాయం కోసం నేపాల్ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. పునర్నిర్మాణానికి 4–5 బిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా వేయగా.. భారత్ ఇప్పటికే సహాయక చర్యలకు సిద్ధమైంది. ప్రతికూల వాతావరణ ప‌రిస్థితిలో నేపాల్ శనివారం గాలింపు, సహాయక చర్యలను నిలిపివేసింది. టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన వినాశకర వరదను ఎదుర్కోవడానికి తమకు విదేశీ సాంకేతిక సహాయం అవసరమని నేపాల్ వేడుకుంది. బుధవారం నాటి వరదలతో జరిగిన విధ్వంసం తర్వాత పునర్నిర్మాణం కోసం 3 కోట్ల జనాభా క‌లిగిన ఈ పేద హిమాలయ దేశానికి సుమారు 4 నుండి 5 బిలియన్ డాలర్ల వరకు అవసరమవుతుందని ఆర్థిక మంత్రి అభ్య‌ర్థించారు, హిమానీనదం కూలిపోవడం వల్ల రాళ్లు, మంచు, బురద, శిథిలాలతో కూడిన భారీ ప్రవాహం బుధవారం పర్వత నదీ వ్యవస్థల గుండా దూసుకెళ్లింది. ఇది తన మార్గంలో భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలను మింగేయడంతో నేపాల్‌లో కనీసం 626 మంది, చైనా టిబెట్‌లో ఏడుగురు మరణించారు. దాదాపు 3,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు వీరిలో నేపాల్‌లో సుమారు 2,426 మంది, టిబెట్‌లోని గిరాంగ్ కౌంటీలో కనీసం 558 మంది ఉన్నారు. వీరిలో కనీసం 540 మంది విదేశీయులు ఉన్నారు, వీరిలో చాలామంది భారతదేశం నుండి వచ్చిన అత్య‌థికులు హిందూ యాత్రికులే. “వర్షం కురుస్తుండటం, వాతావరణం పొగ మంచుతో కూడుకుని ఉండటంతో గాలింపు, సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు,” అని తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా ఉన్నతాధికారి నరేంద్ర పరియార్ తెలిపారు. ర‌క్షిత యాత్రికులను రాజధాని నగరం ఖాట్మాండుకు తరలించడానికి భూమార్గ రవాణాను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. వరద తర్వాత నేపాల్ – చైనా సరిహద్దుకు ఆవలి వైపున ఏర్పడిన ఒక సరస్సు పొంగిపొర్లి నేపాల్‌లోని లెండే ఖోలా, త్రిశూలి నదులలోకి ప్రవహించడం ప్రారంభించడంతో, శుక్రవారం కూడా అధికారులు సహాయక చర్యలను కొద్దిసేపు నిలిపివేశారు. నేపాల్ పర్యవేక్షిస్తున్న వరద ప్రాంతానికి ఎగువన ఉన్న రెండు సరస్సులలో ఇది ఒకటి. ఆ రెండూ పూర్తిగా ఇంకిపోయే వరకు వరద ముప్పు కొనసాగుతుందని ఒక అధికారి హెచ్చరించారు. ఒక సరస్సు కుచించుకుపోతోందని, జలవనరుల మంత్రిత్వ శాఖ విశ్లేషణను ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే, అది అస్థిరంగా ఉండవచ్చని చైనా ప్రభుత్వ భూభౌతిక ప్రమాదాల నిపుణుడు హెచ్చరించారు. ఆ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న 100కు పైగా హిమానీనద సరస్సులు కూడా ముప్పు కలిగించవచ్చని ఆయన అన్నారు. గాలింపు, సహాయక చర్యలకు తమ దేశానికి సహాయం అవసరం లేదని, అయితే సొరంగాలలో చిక్కుకున్న వారిని రక్షించడం, వంతెనలు కూలిపోయిన చోట్ల రవాణా, సమాచార మార్గాలను తిరిగి తెరవడం, మృతదేహాలను గుర్తించడం,

Original source: prabhanews.com
Read more on Kaizer News