Kaizer News

Mirka Federer | ఫెదరర్ కంటే మూడేళ్లు పెద్దదాన్ని..

Mirka Federer | ఫెదరర్ కంటే మూడేళ్లు పెద్దదాన్ని.. నేను వచ్చాకే 103 టైటిళ్లు గెలిచాడు..!

· National - India · ntnews.com

Mirka Federer : టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (Roger Federer) మరో ఘనత సాధించాడు. రికార్డు స్థాయిలో 103 ఏటీపీ టైటిళ్లు, 23 గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు గెలుపొందిన ఈ స్విస్ రాకుమారుడు ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌’లో చోటు సంపాదించాడు. ఆగస్టు 30, ఆదివారం ఫెదరర్‌కు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా అతడి భార్య మిర్కా ఫెదరర్(Mirka Federer) ప్రసంగం అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ‘ఔను.. నేను ఫెదరర్ కంటే పెద్దదాన్ని’ అంటూ మొదలెట్టి.. తమ లవ్ స్టోరీ, వివాహ జీవితం, టెన్నిస్‌లో ఫెదరర్ విజయాలు.. ఇలా ప్రతి అంశాన్నీ క్లుప్తంగా, ఆమె వివరించిన తీరుకు అందరూ మంత్రముగ్దులయ్యారు. పురుషుల టెన్నిస్‌లో శిఖరం.. టెన్నిస్ ఆడడం ఇంత సులువా అనిపించేలా కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన రోజర్ ఫెదరర్ పేరు ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌’లో చేరింది. కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో స్విస్ స్టార్‌ సగర్వంగా ఈ క్లబ్‌లో చేరాడు. ఈ మహోన్నతమైన రోజున ఫెదరర్‌ గురించి.. తమ 26 ఏళ్ల అనుబంధం గురించి మిర్కా ఫెదరర్ మాట్లాడిన విషయాలు హైలెట్‌గా నిలిచాయి. కోర్టులో ప్రశాంతంగా ప్రత్యర్థులను ఓడించే ఫెదరర్ జీవితంలోకి తాను వచ్చిన రోజు నుంచి.. టెన్నిస్ లెజెండ్‌గా అతడు ఎదిగిన తీరును అద్భుతంగా వర్ణించింది మీర. ‘మా ప్రయాణం 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్‌తో మొదలైంది. అప్పుడు నాకు 21 ఏళ్లు కాగా.. ఫెదరర్‌కు 18. అవును.. నేను అతడికంటే మూడేళ్లు పెద్దదాన్ని. కానీ, వయసు అనేది అంకె మాత్రమే అని అతడు నన్ను ఒప్పించాడు. ఇప్పటికీ నన్ను అంతే ప్రేమగా చూసుకంటున్నాడు. మా జర్నీ మొదలైనప్పుడు ఫెదరర్ ఒక్క ఏటీపీ టైటిల్ గెలవలే. చెప్పాలంటే.. అతడు అప్పుడు జీరో. ఇప్పుడు చూస్తే.. ఏకంగా 103 టైటిళ్లు సాధించాడు. సిన్సినాటి ఫైనల్లో ఓటమి అనంతరం ఆండీ రాడిక్‌(అమెరికా) మాట్లాడుతూ.. ‘నేను ఓ మహిళ తీర్చిదిద్దిన వ్యక్తి చేతిలో చిత్తవ్వడాన్ని నమ్మలేకపోతున్నా’ అని అన్నాడు. అతడు చెప్పింది నిజమే. రాడిక్ కామెంట్ తలచుకున్నప్పుడు మాకు నవ్వాగదు. ఫెదరర్‌తో ప్రేమలో పడిన రోజుల్లో అతడిలో గమనించిన మొదటి విషయం.. తనకు దగ్గరైన వాళ్లను అతడు ఎంతో ప్రేమిస్తాడు. టెన్నిస్ ఇంత సులభమా అనిపించేలా చేయడం కోసం అతడు ఎంతో శ్రమించేవాడు. నేను అతడి కష్టాన్ని, క్రమశిక్షణను చూశా. అయితే.. నాకు టెన్నిస్ పెద్దగా నచ్చదు. కానీ, ఆ ఆటకు వన్నె తెచ్చిన ఫెదరర్ మాత్రం ఇష్టం. మేము మొదటిసారి కవలలకు జన్మనిస్తున్నామని తెలిసినప్పుడు ఇక ప్రయాణాలు సాధ్యం కాదని భయపడ్డాం. టెన్నిస్ మ్యాచ్‌లకు ఇద్దరు పిల్లలతో జర్నీ చేయడం కుదరని, ఇక నేను నీవెంట వచ్చే రోజులు దాదాపు ముగిశాయి అని ఫెదరర్‌తో చెప్పాను. అందుకు అతడు.. అలాగైతే నేను టెన్నిస్ ఆడను అని చెప్పేశాడు. అలాఅనీ అతడేమీ డ్రామా చేయలేదు. పిల్లలు, నాకు అతడు ఎంతో ప్రాధాన్యమిచ్చాడు. ఆట కంటే అతడికి కుటుంబమే ముఖ్యం. అయితే.. ట్విన్స్ పుట్టాక ప్రయాణాలు, టెన్నిస్ మ్యాచ్‌లకు వెళ్లడం అన్నీ జరిగిపోయాయి. రెండోసారి కూడా కవలలే. అప్పటినుంచి టెన్నిస్ టూర్ అనేది మా ఫ్యామిలీకి అలవాటైపోయింది. మా నలుగురు పిల్లలు మైలా, చార్లీనే, లియో, లెన్నిలకు ఫెదరర్ స్విస్ప మ్యాస్ట్రోగా కాదు పపాగాన

Original source: ntnews.com
Read more on Kaizer News