Kaizer News

సమరభేరికి సన్నద్ధం

సమరభేరికి సన్నద్ధం

· City - Hyderabad · ntnews.com

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం మేడ్చల్‌, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరికి నేతలందరూ సిద్ధ్దమవుతున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుతో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో కార్యాచరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. జిల్లాలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు.. ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి తదితరులతో సమవేశమయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సమావేశంలో చర్చించారు

Original source: ntnews.com
Read more on Kaizer News