old Price Today: పసిడి, వెండి ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. గత కొన్ని రోజులుగా తగ్గినట్లే తగ్గి ఊరటనిచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆగస్టు 30 ఉదయం సమయానికి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో స్థిరంగా కొనసాగుతూ కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం మన దేశంలో బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య రాజుకుంటున్న వివాదాలు, రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ మొదలైన ఉద్రిక్త పరిస్థితుల వల్ల మదుపరులు తమ పెట్టుబడులను భద్రమైన పసిడి వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల బులియన్ మార్కెట్‌లో డిమాండ్ ఊహించని రీతిలో పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆర్థిక అస్థిరతలే బంగారం, వెండి రేట్లు నాన్‌స్టాప్‌గా పెరగడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, ప్రధాన నగరాల్లో తాజా రేట్లు దేశీయంగా ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,58,240 వద్ద ఉంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,45,050 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా బంగారంతో పోటీ పడుతూ దూసుకుపోతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర భారత మార్కెట్‌లో రూ.2,55,000 వద్ద విక్రయమవుతోంది. పండగల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ రేట్లు సామాన్యులకు తీవ్ర భారాన్ని కలిగిస్తున్నాయి. మన దేశంలో పన్నుల విధానం, స్థానిక డిమాండ్ ఆధారంగా నగరాల మధ్య ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,58,240 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,45,200గా ఉంది. ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో 24 క్యారెట్ల పసిడి రూ.1,58,240, 22 క్యారెట్ల పసిడి రూ.1,45,050 వద్ద వ్యాపారం సాగిస్తున్నాయి. చెన్నై నగరంలో 24 క్యారెట్ల రేటు రూ.1,58,240 వద్ద ఉంటే, అక్కడ కిలో వెండి ధర ఏకంగా రూ.2,60,000 మార్కును తాకింది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ప్రతిరోజూ మారుతున్న ధరలను తెలుసుకోవడం ఎంతో అవసరం. స్థానిక బులియన్ మార్కెట్ ట్రెండ్స్ ఆధారంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నారు. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది