ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వినియోగదారులకు సాధారణంగా రేంజ్, ఛార్జింగ్ టైమ్ గురించి టెన్షన్ పడతారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించేలా, ఒకవేళ బ్యాటరీ అయిపోతే మళ్లీ త్వరగా ఛార్జింగ్ చేయడానికి తక్కువ సమయం తీసుకునే EV ని ప్రజలు కోరుకుంటారు. ఈ సమయంలో చైనాకు చెందిన BYD కంపెనీ ఈ 2 విషయాల్లోనూ ఎంతో ప్రత్యేకమైన ఒక ఎలక్ట్రిక్ సెడాన్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీకి చెందిన Denza Z9S కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. దీని బ్యాటరీని కేవలం కొన్ని నిమిషాల్లోనే భారీ స్థాయిలో ఛార్జింగ్ చేయవచ్చు. చైనాలో విడుదలైన ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్ Denza Z9S. దీని ప్రారంభ ధర సుమారు 47,100 డాలర్లు, అంటే దాదాపు రూ. 40 లక్షలు అని వినిపిస్తోంది. ఈ ధరతో పాటు కారు ఇచ్చే లాంగ్ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ దీని ప్రత్యేకతగా నిలిచాయి. కారు అతిపెద్ద ప్రత్యేకత దీని ఛార్జింగ్ స్పీడ్. BYD ఇందులోతమ సొంత Blade Battery టెక్నాలజీ ఉపయోగించింది. Denza Z9S బ్యాటరీని కేవలం 5 నిమిషాల్లోనే 10% నుండి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చునని కంపెనీ తెలిపింది. షాల సమయం పడుతుంది. అంటే లాంగ్ రేంజ్ జర్నీల సమయంలో బ్యాటరీ తగ్గితే, కాసేపు ఛార్జ్ చేసినా సరే కారును చాలా దూరం నడపవచ్చు. Denza Z9S కారును 3 వేర్వేరు వేరియంట్లలో తీసుకొచ్చారు. వీటి రేంజ్ వేర్వేరుగా ఉంటుంది. బేస్ వేరియంట్ రేంజ్ దాదాపు 780 కిలోమీటర్లు కాగా, రెండవ వేరియంట్ రేంజ్ దాదాపు 920 కిలోమీటర్లు ఇస్తుంది. ఇక టాప్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇక్కడ 780, 920, 1,100 కిలోమీటర్ల లాంగ్ రేంజ్ అనేది చైనాకు చెందిన CLTC టెస్టింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రోడ్లపై అధికంగా నడిపే సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే CLTC టెస్ట్‌లో ఎక్కువ రేంజ్ నమోదవుతుంది. రియల్ లైఫ్‌లో కారు రేంజ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, Denza Z9S కారును ఒకవేళ అమెరికన్ EPA టెస్టింగ్ ప్రమాణాల ప్రకారం లెక్కిస్తే, దీని రేంజ్ దాదాపు 772 కిలోమీటర్లు అని అంచనా వేశారు. అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్ల విషయానికొస్తే, అమెరికాకు చెందిన Lucid Air Grand Touring ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంటుంది. దీని EPA రేంజ్ దాదాపు 824 కిలోమీటర్లుగా పేర్కొంది. Denza Z9S దావా వేస్తున్న 1,100 కిలోమీటర్ల రేంజ్ దీనికంటే ఎక్కువే అయినప్పటికీ, ఈ రెండు కార్ల గణాంకాలు వేర్వేరు టెస్టింగ్ సిస్టమ్‌లపై ఆధారపడి ఉన్నాయి. అందుకే వీటి రేంజ్‌ను పోల్చలేము. nza Z9S ప్రత్యేకత కేవలం దాని లాంగ్ రేంజ్ మాత్రమే కాదు, దాని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసేటప్పుడు. ఒక EV బ్యాటరీ కేవలం కొన్ని నిమిషాల్లోనే 60- 70% లేదా అంతకంటే ఎక్కువ ఛార్జ్ అయితే, ఛార్జింగ్ స్టేషన్ల వద్ద వెయిటింగ్ టైం చాలా తగ్గుతుంది. ప్రస్తుతానికి Denza Z9S కారును చైనాలో విడుదల చేసినట్లు సమాచారం. భారత్‌లో దీని లాంచ్ గురి